Take a fresh look at your lifestyle.

తిరుపతి ఉప ఎన్నికలో ఉద్యమ జెఎసి ఉమ్మడి అభ్యర్థి

‌తిరుపతి ఉపఎన్నికల్లో విశాఖ ఉద్యమం ఐక్యతను చాటుతామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉద్యమ ఐకాస తరఫున ఉమ్మడిగా ఎంపీ అభ్యర్థిని నిలబెట్టే అంశంపై అఖిలపక్షంతో చర్చిస్తామని గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం వి•డియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఉద్యమానికి శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చామని తెలిపారు. విశాఖ గుండె చప్పుడు ఒక ప్రైవేట్‌ ‌వ్యక్తికి ఇచ్చేస్తుండటం అనే ఆలోచనే బాధాకరమని… శరీరం నుంచి ఓ భాగం వేరు అయినట్లు ఉందని అన్నారు. టీడీపీ, జనసేన, వామపక్షాలు అన్నీ విశాఖ ఉక్కు కోసం నిలబడ్డాయని చెప్పారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు అని, అమ్మేస్తాం లేదా మూసేస్తాం అన్నట్లు కేంద్ర వైఖరి ఉందని మండిపడ్డారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాము అని నిర్మలా సీతారామన్‌ ‌చెప్పారన్నారు. విశాఖ ఉక్కు బాధ్యతను సీఎం జగన్‌ ‌తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. సీఎం జగన్‌ ‌చొరవ తీసుకుంటే కలిసి నడుస్తానని చంద్రబాబు స్పష్టం చేశారని గుర్తు చేశారు. రాజీనామా చేస్తే ఎలా పోరాడతాం అని వైసీపీ మంత్రులు అంటున్నారని… అయితే చివరి అస్త్రం రాజీనామాలు సంధించే సమయం ఆసన్నమైందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని డిమాండ్‌ ‌చేశారు. పవన్‌ ‌కల్యాణ్‌ ఉద్యమంలో నేరుగా పాల్గొంటే ప్రభావం ఎక్కువ ఉంటుందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Leave a Reply