Take a fresh look at your lifestyle.

ఉద్యమనేతను మరిచారు

  • ఆవిర్భావదినోత్సవం రోజు ప్రొ.జయశంకర్‌ ‌సార్‌ ‌విగ్రహాన్ని గాలికి వదిలేశారు
  • ఉద్యమానికి మార్గదర్శి విగ్రహంకు పుష్పగుచ్చమే కాదు, నమస్కారానికి కూడా నోచుకోలేదు

ప్రత్కేక రాష్ట్రం కోసం జీవితాన్నే అంకింతం చేసిన ఉద్యమనేతను మరిచారు. ఉద్యమానికి మార్గదర్శిగా చివరి శ్వాస వరకూ నినాదాన్ని ఆపని ఆయన్ను అవమానించారు. అందరూ సార్‌ అని ప్రేమగా పిలుచుకునే ప్రొఫెసర్‌ ‌కొత్తపల్లి జయశంకర్‌ ‌సార్‌ ‌విగ్రహాన్ని తెలంగాణా సాధిం చామని గర్వంగా చెప్పుకునే రోజు గాలికి వదిలేసారు. జూన్‌ ‌మంగళ వారం 2న తెళంగాణా ఆవిర్భావ దినోత్సవం ప్రభుత్వ కార్యాల యాలలో, పార్టీ కార్యలయాలలో అక్కడక్కడా ప్రజా ప్రతినిధులు మాత్రమే నామ మాత్రంగా జరుపుకున్నారు. మండలంలోని పాత పోలీస్‌ ‌ష్టెషన్‌, ‌పీఏసీఎస్‌ ‌కార్యాలయం ఆవరణలో ప్రధాన రహదారి పక్కన ఉన్న జయశంకర్‌ ‌సార్‌ ‌విగ్రహం మాత్రం పుష్పగుచ్చ మే కాదు నమస్కారానికి కూడా నోచుకోలేదు.

ప్రొఫెసర్‌గా విద్యారు్ధ ల్లో చైతన్యం నింపిన స్పూర్తిదాత జయసెంకర్‌ ‌సార్‌ ‌విగ్రహం ఆవిర్భావ దినోత్సవంం రోజున విలవిల బోయింది. ప్రత్కేక రాష్ట్రమే అంతిమ లక్ష్యంగా ఉద్యమ బావ జాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తిని నాయకులు మరిచారు. ఆయన పిలుపుతో ఎంతోమంది ఉద్యోగస్తులు, ఉద్యమకారులు ఆయన వెనుక నడిచారు. బంగారు తెలంగాణా ద్యేయంగా ఆయన నింపిన స్పూర్తిని మరచి పదవుల కోసం ఉద్యమకారులను పక్కకు నెట్టారు. తెరాసా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున కనపడిన ఉత్సాహం తెలంగాణా రాష్ట్ర అవతరణ రోజున కనపడకపోవడం రాష్ట్రం కోసం కలలు కన్న అమరవీరులకు అవమానమని ఉద్యమకారులు వాపోతున్నారు. జయశంకర్‌ ‌సార్‌ ‌చనిపోయే నాటికి ఆయన కన్నకల సాహకారం కాకపోయినా, కాస్త ఆలస్యంగా అది నెరవేరింది. ఆయన కోరుకున్న తెలంగాణా కల ఫలించింది. ఆయన సేవలను స్పూర్తిని గుర్తు చేసుకుంటూ విగ్రహానికి పూలమాల వేసి గౌరవించే వారే లేకపాయె. స్వరాష్ట్రంలో తెలంగాణా తలెత్తుకునే రోజు వర్గవిభేదల వంతులు నాయకత్వ లోపం ఆయనను మరవడం బాధాకరం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!