- సిఎం కెసిఆర్ తీరుపై మండిపడ్డ
- తెజాస జిల్లా కో అర్డినేటర్ తోడుపునూరి వెంకటేశం
ఉద్యమకారుల త్యాగాలు, అమర వీరుల ఆత్మ బలిదనాల ఫలితంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రలో కేవలం ఒక్క కుటుంబానికే స్వరాష్ట్ర ఫలాలు అందుతున్నాయని తెలంగాణ జనసమితి జిల్లా కోఅర్డినేటర్ తోడుపునూరి వెంకటేశం అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవంను పురస్కరించుకొని మంగళవారం స్థానిక రంగధాంపల్లి చౌరస్తా వద్ద అవవీరుల స్థూపానికి తెజాస నేతలు నివాలర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం అమరవీరుల బలిదానాల పలితమేనన్నారు. అమరుల ఆశయాలను తెరాస ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. తెలంగాణ ద్రోహులకు క్యాబినెట్లో ఉన్నత పదవుల్లో పెద్ద పీటవేస్తూ ఉద్యమకారులను తెరాస నేతలు అనిచి వేశారని ఆరోపించారు.
తెరాస ప్రభుత్వం సీమాంధ్ర పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పని చేస్తుందన్నారు. మహిళలను బీసీలను, దళిత గిరిజన, వర్గాలను రైతుల ఏమార్చుతూ తెరాస పాలన సాగుతుందన్నారు. కుటుంబ, నియంత ,అవినీతి పాలన సాగిస్తున్న సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెరాస సర్కార్కు ప్రజలు బుద్దిచెప్పె రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రజలకిచ్చిన హామీలైన ఉచిత విద్య, కార్పొరేట్ వైద్యం, ఇంటికో ఉద్యోగం, కోటి ఎకరాలకు సాగునీరు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూంల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. అధే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో సైతం తెరాస సర్కార్ విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో తెజాసా పట్టణ అధ్యక్షుడు పుల్లయ్య గారి వెంకట్ గౌడ్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయ ఎల్లం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి గోపాలపురం స్వరాజ్, బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర నాయకుడు దాసరి మానిక్ దాస్ తదితరులు పాల్గొన్నారు.