జిల్లాలో సాకార ఎన్నికలు జోష్ ప్రారంభమయ్యాయి ప్రతో పరపతో సంఘం వద్ద రైతులను ఏవైధంగా బుట్టలో వేసుకోవాలో ఇప్పటికే అధికార ప్రతి పక్షాలు సమయమత్తమ య్యాయి జిల్లాలో గూడూరు. కేసముద్రం ధనసరి నెల్లికుదురు శ్రీరామగిరి ,ఎర్రబెల్లిగూడెం గార్ల డోర్నకల్ , మన్నెగూడెం మరిపెడ నర్సింహులపేట తోఱుర్ మహబూబాబాద్ కురవి గుండ్రతిమడుగు, కాంపెల్లి బయ్యారం పోగులప్పలి ,సోసిటీ లకు ఎన్నికలు నిర్వహించడాన్ని అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు ఆయా సమితిలకు ఎన్నిక నిర్వాహక అధికారులను నియమిం చారు. ఇది ఇలావుండగా ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికలోఅధికార పార్టీ ముందువునట్టే ఈ ఎన్నికలో తమ సత్తా చాటాలని గులాబిశ్రేణులు సమయమయ్యారు రైతులకు సంబందింన ఎన్నికల కాబ్బటి అధికార పార్టీ ప్రత్యేక్షంగా కాకూండా పరోక్షంగా బేరసారాలు నిర్వహించి జిల్లా అంత టా పరపతి సమితిలపై గులాబీ బావుటా ఎగురవేయాలని నిర్ణయించాయి . దానికి అనుగుణంబ రైతు బంధు రైతు భీమా పట్టా లిస్టులను ముందు పెట్టుకొని మరి కలుస్తున్నారు ఇంకా రైతులకు పట్టా పుస్తకాలూరాని వారికి దగ్గరుండి పాసు పుస్తకాలూఇపించడానికి అధికారులతో మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఈ సహకార ఎన్నికలతో పూర్తి స్టయిల్లో రాష్ట్రమంతా ఎన్నికల తంతు ముగుస్తుందని ఇక కేవలం అభివృద్ధి సంక్షేమాలపై దృష్టి పెడతారని ప్రజలు ఆశిస్తున్నారు .
బరిలో వున్న అభ్యర్థులు
మూడోరోజు ఉప్పొంగిన ఉత్సాహంతో నామినేషన్లు దాఖలు చేశారు.గార్ల, శ్రీరామగిరి ,తొర్రూరు, ధన్నసరి, గూడూరు, మహబూబాబాద్, డోర్నకల్, గుండ్రాతిమడుగు, బయ్యారం సహకార సంఘాల్లో ఆధిక సంఖ్యలో పోటీ పడడానికి నామినేషన్లు వేశారు. మహబూబాబాద్‌లో నా యిని రంజిత్ రెడ్డి, తొర్రూరులో కాకరాల హరిప్రసాద్, ధన్నస రి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల నామినేషన్ల బరిలో మర్రి రంగారావు, రాజులపాటి ఉప్పలయ్య బండారి వెంకన్న కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి సారంపల్లి మల్లారెడ్డి ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది కేసముద్రంలో పాల్వాయి శ్రీరాంరెడ్డి భీరం గోపాల రెడ్డి భూలోక రెడ్డినామినేషన్లను దాఖలు చేశారు మల్యాల ఎఎసిఎస్ మినహాయించి 18 సహకార సంఘాలు, 204 శ్రీనివాసరెడ్డి, భూక్య మంగీలాల్, జైపాల్, అజ్మీర రాము, రాజబాయ్ తదితరులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు
139 మంది అభ్యర్థుల నామినేషన్లు
నెల్లికుదురు ఫిబ్రవరి 07(ప్రజాతంత్ర విలేకరి) : మండలంలోని శ్రీరామగిరి, నెల్లికుదురు, ఎర్రబెల్లి గూడెం ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గాలకు నిర్వహిస్తున్న ఎన్నికల్లో డైరెక్టర్లుగా పోటీ చేయుటకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు 139 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. శ్రీరామగిరి 13 టి సి లకు (48) నెల్లికుదురు 13 టిసిలకు ( 58) ఎర్రబెల్లి గూడెం 13 టిసిలకు (33) నామినేషన్లు వేసినట్లు తెలిపారు.
పిఎస్సిఎస్ భారీగా నామినేషన్లు దాఖలు
మరిపెడ,ఫిబ్రవరి8,(ప్రజాతంత్ర విలేకరి): మరిపెడ సహకార సంఘాన్ని సమరం ప్రారంభమైన నేపథ్యంలో చివరి రోజు43 డైరెక్టర్ కునామినేషన్ పత్రాలను భారీగా దాఖలు చేసినట్లు ఎన్నికల ఇంచార్జి లక్ష్మీ నారాయణ తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మరిపెడ సహకార సంఘం కు13డైరెక్టర్ లు ఉండగా ఒకటవ వార్డులో 2,రెండో వార్డు లో 2,మూడోవ వార్డులో 4,నాలుగో వార్డు లో 2,ఐదోవ వార్డు లో5,ఆరోవ వార్డు లో5,ఏడువ వార్డు లో 5,ఎనమిది వ వార్డ్ లో3,తొమ్మిదో వ వార్డు లో6,పదోవ వార్డులో2,పదకొండు వ వార్డు లో 2,పన్నెండు వార్డులో2, పదముడువ వార్డు లో 3 మొత్తం 43 నామినేషన్ లు దాఖలు అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏ సి ఎస్ ,సి ఓ నరేష్ ఎన్నికల అధికారులు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
నర్సంపేట, ఫిబ్రవరి 08, (ప్రజాతంత్ర విలేకరి) : నర్సం పేట డివిజన్లోని అన్ని మండలాల్లో సొసైటి ఎన్నికల సందర్బంగా నామినేషన్ల స్వీకరణ ముగిసింది. డివిజన్లోని దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, నర్సంపేట మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చెన్నారావుపేట మండలంలో 79 మంది నామినేషన్లు వేశారు. ఖానాపురంలో 88 మంది నామినేషన్లు వేశారు. దుగ్గొండిలో 4 పీఏసీఎస్‌లుండగా 52 టీసీలకు 185 మంది నామినేషన్ వేశారు. నెక్కొండ మండల కేంద్రంలోని పిఎసిఎస్ పరిధిలో 13 వార్డులకు 53 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించినట్లు ఎన్నికల అధికారి ఆడిదల సంపత్ రెడ్డి తెలిపారు. రెడ్లవాడ సొసైటీ పరిధిలో 13 వార్డులకు 42 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించినట్లు ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. అలాగే సూరిపల్లి సొసైటీ పరిధిలో 13 వార్డులకు 49 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి సుధాకర్ తెలిపారు. మండలంలోని 39 వార్డులకు 144 మంది అభ్యర్థులు నామ పత్రాలు సమర్పించారు. నర్సంపేట మండలంలో 52, నల్లబెల్లి మండలంలో 61 మంది నామినేషన్లు వేశారు.
నెక్కొండలో…
నెక్కొండ, ఫిబ్రవరి 08, (ప్రజాతంత్ర విలేకరి) : ఈనెల 15వ తేదీన జరగనున్న పిఎసిఎస్ ఎన్నికల నామినేషన్ పత్రాల స్వీకరణ శనివారంతో ముగిసింది. మండలంలోని మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో భారీగా నామ పత్రాలు దాఖలయ్యాయి. మండల కేంద్రంలోని పిఎసిఎస్ పరిధిలో 13 వార్డులకు 53 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించినట్లు ఎన్నికల అధికారి ఆడిదల సంపత్ రెడ్డి తెలిపారు. రెడ్లవాడ సొసైటీ పరిధిలో 13 వార్డులకు 42 మంది అభ్యర్థులు నామ పత్రాలను సమర్పించినట్లు ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. అలాగే సూరిపల్లి సొసైటీ పరిధిలో 13 వార్డులకు 49 మంది అభ్యర్థులు నామ పత్రాలను దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి సుధాకర్ తెలిపారు. మండలంలోని 39 వార్డులకు 144 మంది అభ్యర్థులు నామ పత్రాలు సమర్పించారు.
సహకార సంఘం నామినేషన్లు పూర్తి
కురవి ఫిబ్రవరి 8 (ప్రజాతంత్ర విలేకరి) : మండలంలో 3 సహకార సంఘాలకు శనివారం నాడు నామినేషన్లు పూర్తి అయ్యాయి. మొదటి రోజు నామినేషన్లు మూడు సెంటర్లలో ఎవరు నామినేషన్లు వేయలేదు. రెండవ రోజు శుక్రవారం మంచి రోజని కాంపెల్లి సొసైటీ నుంచి 6.గుండ్రాతిమడుగు సొసైటీ నుంచి 17.కురవి సొసైటీ నుంచి నామినేషన్ దాఖలు చేయగా. మూడో రోజు శనివారం ఆఖరి రోజు కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మండలంలోని గుండ్రాతిమడుగు సొసైటీ 13 వార్డులకు 41 నామినేషన్లు దాఖలు కాగా కురవి సొసైటీ 13 వార్డులకు 40 నామినేషన్లు దాఖలు కాగా కాంపల్లి సొసైటీ 13 వార్డులకు 38 నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు తెలిపారు. తొమ్మిదవ తారీకు నామినేషన్ల పరిశీలన పదవ తారీకు ఉపసంహరణ లు ఉన్నట్లు తెలిపారు.
Tags: mountain closed, society election, nominations