Take a fresh look at your lifestyle.

మౌనం

మౌనం ఒక తపస్సు
మౌనం మనసులోని ఉషస్సు
మంచి భావనల యశస్సు
మౌనం అంతరంగ తేజస్సు
మౌనం మూగది కాదు
మాట్లాడకపోవడం మౌనం కాదు
మౌనం మనసుతో మాట్లాడుకోవడం
మౌనం ఊహల ఊసులను పలకరిస్తుంది
లోకాలోకాలను దర్శిస్తుంది
మౌనం మూగ భావాలకు ప్రాణం
మనసు విప్పని, చెప్పని మౌనం
అర్ధాంగికారమే!
అనుభూతులు ఆవేదనలు ఆవరించినప్పుడు
మౌనం మౌని రూపు దాల్చుతుంది
మౌనం ఆలోచనల హృద్గతం
అంతరంగ బావ మనోగతం
జీవిత రంగస్థలంపై
తోలు బొమ్మలకు, మర బొమ్మలకు
తెర బొమ్మలకు మౌనామృతం
జీవం పోస్తున్నది !
మౌనం అంతరంగ శక్తి తరంగం
మనిషిని నడిపిస్తున్న దివ్య తేజం
మౌనాన్ని భగ్నం చేయకు
మౌనం భగ్నం అయితే…
ఉగ్ర నరసింహం అవుతుంది
కాలి భస్మం అయిపోతావు జాగ్రత్త!

 – పి.బక్కారెడ్డి
9705325250

Leave a Reply