Take a fresh look at your lifestyle.

బిజెపికి మోత్కుపల్లి రాజీనామా

తనకు బిజెపిలో గౌరవం దక్కలేదని ఆవేదన
ఈటలను పార్టీలో చేర్చుకోవడం బాధించిందని వెల్లడి
సిఎం కెసిఆర్‌ ‌దళితబంధు పథకం అద్భుతమని కితాబు
హుజారాబాద్‌లో టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపు
రాష్ట్ర బిజెపికి షాక్‌ ‌తగిలింది. హుజారాబాద్‌ ఉప ఎన్నికలకు వెళుతున్న వేళ భారతీయ జనతా పార్టీకి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు మోత్కుపల్లి తెలిపారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌ అవినీతిపరుడని ధ్వజమెత్తారు. ఈటలకు అంత ఆస్తి ఎలా వొచ్చిందని అంటూ..ఈటలను హుజురాబాద్‌ ‌ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈటలను బీజేపీలో చేర్చుకోవడం బాధించిందన్న ఆయన దళితుల భూములను వాపస్‌ ఇవ్వాలని మొదట్నుంచి చెబుతున్నానని అన్నారు. ఒక వ్యక్తిని పార్టీలో చేర్చుకునే ముందు ఆ వ్యక్తి క్రెడిబిలిటీ చూడాలి. ఈటల వి•ద ఎందుకు సానుభూతి చూపాలని, ఆయనను బీజేపీ నెత్తివి•ద మోయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. తనకు బీజేపీ నాయకులు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. సీనియర్‌ ‌నాయకుడిని అయిన తనకు బీజేపీలో సముచిత స్థానం దక్కకపోవడమే గాకుండా. అవినీతిపరుడైన ఈటలను బీజేపీలో చేర్చుకోవడం తనను బాధించిందిన్నారు.

ఈటల చేరిక గురించి పార్టీ నేతలు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మోత్కుపల్లి ఆరోపించారు. ఇకపోతే సీఎం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు. దళిత సాధికారత కోసమే కేసీఆర్‌ ‌దళిత బంధు పథకం తెచ్చారు. ఆయన అపర అంబేడ్కర్‌ అం‌టూ కెసిఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. తాను ఏదో ఆశించి ఇలా చెప్పడం లేదన్నారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్‌ ‌తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

దళితుల గుండెల్లో అంబేద్కర్‌ ‌వారసుడిగా కేసీఆర్‌ ‌మిగిలిపోతారు. దళిత బంధును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. దళితులందరూ సీఎం కేసీఆర్‌ అం‌డగా నిలబడి హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీని గెలిపించాలన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఆయనకు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం. దళితబంధు పథకం ముందుకు తీసుకుని వెళ్లే క్రమంలో మోత్కుపల్లిని చేర్చుకోవడం అవసరమని టిఆర్‌ఎస్‌ ‌భావిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply