Take a fresh look at your lifestyle.

ఆదాయం పెరిగేలా రైతుల్ని చైతన్యపరచండి

  • వారం, పది రోజుల్లో వొస్తా…యాక్షన్‌ ‌ప్లాన్‌ ‌సిద్ధం చేసుకోండి
  • తోర్నాల మక్కజొన్న పరిశోధన శాస్త్రవేత్తలకు మంత్రి హరీష్‌రావు దిశానిర్దేశం

రైతుల పొలం దగ్గర కూర్చోండి. రైతుల ఆదాయం పెరిగేలా వారిని చైతన్యం చేయండి. ఈ యేటా వానాకాలం, యాసంగిలో 50 ఎకరాలలో మార్పు తెచ్చేలా.. 50 మంది రైతుల జీవితాల్లో మార్పు తేవడమే లక్ష్యంగా పని చేద్దామని తోర్నాల పాలిటెక్నిక్‌ ‌కళాశాల, మక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేట రూరల్‌ ‌మండలంలోని తోర్నాల మక్కజొన్న విత్తన పరిశోధన స్థానాన్ని బుధవారం మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీనియర్‌ ‌శాస్త్రవేత్త డాక్టర్‌ ఏవీ.రామాంజనేయులు, వ్యవసాయ పాలిటెక్నిక్‌ ‌కళాశాల ప్రిన్సిపాల్‌తో కలిసి పరిశోధన కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ యేటా వానాకాలం, యాసంగి పంటలపై యాక్షన్‌ ‌ప్లాన్‌పై శాస్త్రవేత్తలతో కలిసి సుదీర్ఘంగా సమీక్షించారు.

అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలుగా రెండున్నరేళ్ల కాలంలో తెచ్చిన గుణాత్మకమైన మార్పులు, ఇప్పటివరకు మనం ఏం మార్పు తేగలిగామన్న విషయమై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. రైతు ఆదాయం, రైతు ప్రోడక్టివిటీ-ఉత్పాదన పెరిగేలా చొరవ చూపాలని కోరారు. జిల్లాలో కాళేశ్వరం నీళ్లు వొచ్చాక రైతులు పొద్దు తిరుగుడు వేస్తలేరని, రైతుల ఆలోచన విధానంతో పాటు మనం మారి, రైతుల ఆదాయం పెంపు జరిగేలా కృషి చేయాలని సూచించారు. మొదటి ప్రాధాన్యత వానాకాలం, యాసంగి పంటల్లో రైతుల్లో మార్పు వొచ్చేలా 50 ఎకరాల్లో 50 మంది రైతుల జీవితాల్లో మార్పు తేవడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్దామని, ఈ కార్యక్రమానికి శాస్త్రవేత్తలతో పాటు ఆయా గ్రామాల్లో నిర్వహించే రైతు సదస్సులో పాల్గొనేందుకు తాను సైతం వొస్తానని మంత్రి చెప్పారు.

మక్కజొన్న, వరి పంటలపై కాకుండా ఇతర పంటల సాగుపై రైతులతో ముఖాముఖి జరిగేలా ప్రతి గ్రామాన్ని ఇద్దరు శాస్త్రవేత్తలు దత్తత తీసుకుని, ఆ గ్రామంలో మార్పు తేవడమే లక్ష్యంగా చేసుకుని కృషి చేయాలని మంత్రి కోరారు. 12 మంది శాస్త్రవేత్తల్లో ప్రతి గ్రామానికి ఇద్దరు శాస్త్రవేత్తలు చొప్పున 4 గ్రామాల్లో మార్పులు తేవడానికి ముందుకు వస్తే, ఆ గ్రామానికి ఒక సీడ్‌ ‌కంపెనీ, మంచి ప్రజాప్రతినిధిని అప్పగిస్తాననీ, దీంతో ఆయా ప్రాంత రైతులలో, ప్రజల్లో సామాజిక మార్పుకోసం ప్రయత్నం చేయాలని మంత్రి చెప్పుకొచ్చారు.

Motivate farmers to increase income

ముందుగా తోర్నాలకు 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల రైతులతో ముఖాముఖి ప్రారంభించి వారిలో చైతన్యం కలిగిస్తే మిగతా గ్రామాలు ముందుకొస్తాయనీ, ఇందు కోసం మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ప్రత్యేకించి కావేరి, నూజివీడు, ప్రసాద్‌ ‌సీడ్స్ ‌కంపెనీ ప్రతినిధులతో అవసరమైన ఏర్పాట్లు చేయిస్తానని శాస్త్రవేత్తలకు మంత్రి మాట ఇచ్చారు. ఈ మేరకు పాలిటెక్నిక్‌ ‌కళాశాలలోని ముగ్గురు శాస్త్రవేత్తలను కలుపుకుని 12 మంది శాస్త్రవేత్తలు రైతు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మక్కజొన్న విత్తన పరిశోధన కేంద్రం, పాలిటెక్నిక్‌ ‌కళాశాలకు అవసరమైన 3 ఫామ్‌ ‌పాండ్స్, ‌ఫిష్‌ ‌పాండ్‌, ‌గచ్ఛకాయ తదితర వనరులు త్వరలోనే సమకూర్చాలని ఆయా శాఖాధికారులను ఫోన్‌లైనులో అక్కడికక్కడే మంత్రి ఆదేశించారు. మరో వారం, పది రోజుల్లో తిరిగి సమీక్ష నిర్వహిస్తానని, అప్పటిలోపు కావాల్సిన యాక్షన్‌ ‌ప్లాన్‌ ‌నివేదిక సిద్ధం చేసుకోవాలని తోర్నాల మక్కజొన్న విత్తన పరిశోధన, పాలిటెక్నిక్‌ ‌కళాశాల శాస్త్రవేత్తలకు మంత్రి హరీష్‌రావు సూచించారు. ఈ సమీక్షలో సుడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌ ‌రెడ్డి, జడ్పిటిసి సభ్యుడు కోటగిరి శ్రీహరి, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ‌రామలక్ష్మి, డిఆర్డీఏ పిడి గోపాల్‌ ‌రావు, పాలిటెక్నిక్‌ ‌కళాశాల ప్రిన్సిపాల్‌, ‌శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply