Take a fresh look at your lifestyle.

ఘనంగా మోతి మాత జాతర ఉత్సవాలు

Moti Mata,non-stop celebration,mogudampally
ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావుకు ఘన స్వాగతం

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం లోని ఉప్పర్‌ ‌పల్లి తండా లోని మోతి మాత జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే, గిరిజనుల ఆరాధ్య దైవం ఆదిశక్తి దేవతగా కొలుస్తారు. మోతీ మాతను ఈ జాతర విశిష్టత ఏమిటంటే పూర్వం  మోతి మాత వెలసిన ప్రదేశంలో అనేక మహిమలు జరిగినట్లు బస్సు చక్రాలు లేకుండా పరిగెత్తి నట్లు ఆనవాళ్లు ఉన్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు .మరియమ్మ శ్రీ రూపంలో అమ్మవారి రూపంలో భక్తులతో మాట్లాడడం సాక్షాత్తు చూసినట్లు ఇప్పటికి భక్తులు తెలియజేస్తుంటారు. కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర బళ్లారి రాజస్థాన్‌ ‌నుంచి అధిక వ్యక్తులు గోండు  ఇతర రాష్ట్రాలకు చెందిన గిరిజనులు భక్తులు ఇసుకేస్తే రాలనంతగా హాజరయ్యారు.

మోతి  మాతను  దర్శించుకున్న  మంత్రి హరీష్‌ ‌రావు
మోతి మాత దర్శనానికి శుక్రవారం ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు, హాజరై అమ్మవారి దీవెనలు పొందారు. ఆలయ నిర్వాహకులు పూజారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.హరీష్‌ ‌రావుకు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు కిషన్‌ ‌పవర్‌ ‌మోతీ రాము రాథోడ్‌ ‌వివిధ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉన్నత ఉద్యోగులు రాజకీయ నాయకులు సామాజిక వర్గం వారు అమ్మవారి దీవెనలు పొందారు. భక్తులు భక్తిశ్రద్ధలతో దూరప్రాంతాల నుంచి తరలి వచ్చారు.మంత్రి వెంట  జహిరాబాద్‌ ఎం‌పీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌ ‌రావు, ఎమ్మెల్సి పరిదో ద్దీన్‌, ‌జడ్పీటీసీ అరుణ మోహన్‌ ‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: Moti Mata,non-stop celebration,mogudampally

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply