Take a fresh look at your lifestyle.

మొతేరా క్రికెట్‌ ‌స్టేడియానికి ప్రధాని మోడీ పేరు

  • మొతేరా క్రికెట్‌ ‌స్టేడియానికి ప్రధాని మోడీ పేరు
  • ప్రారంభించిన భారత రాష్ట్రపతి రాంనాథ్‌ ‌కోవింద్‌

ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్‌ ‌స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని మొతెరా క్రికెట్‌ ‌స్టేడియం పేరు మారిపోయింది. పునర్నిర్మాణానికి ముందు సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌స్టేడియం అని ఉన్న ఈ పేరును తాజాగా నరేంద్రమోదీ స్టేడియంగా పేరుగా మార్చారు. ఇంగ్లండ్‌-ఇం‌డియా టెస్ట్ ‌మ్యాచ్‌కి ముందు ఈ పేరు మార్చినట్లు బుధవారం ప్రకటించారు.

ఈ స్టేడియంకు సర్దార్‌ ‌పేరు ఉన్నప్పటికీ మొతేరా అనే ప్రాంతంలో ఉండడం వల్ల దీనిని వాడుకలో మొతేరా స్టేడియం అని కూడా పిలుస్తుంటారు. బుధవారం ఈ స్టేడియం ప్రారంభోత్సవం భారత రాష్ట్రపతి రాంనాథ్‌ ‌కోవింద్‌ ‌చేతుల మీదుగా జరిగింది. ఈ సమావేశానికి హోమంత్రి అమిత్‌ ‌షా, బీసీసీఐ కార్యదర్శి జయ్‌ ‌షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ ‌రిజిజు పాల్గొన్నారు. వీరందరి సారధ్యంలో అంగరంగవైభవంగా ఈ క్రికెట్‌ ‌స్టేడియం ప్రారంభోత్సవం జరిగింది. అయితే ఈ స్టేడియం ప్రారంభోత్సవానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ ‌గంగూలీ హాజరు కాలేకపోయారు.

mothera stadium named with pm narendra modi

కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని బీసీసీఐ పేర్కొంది. ఇకపోతే, ఈ స్టేడియం ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర హోమంత్రి అమిత్‌ ‌షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్రీడా మైదానంగా చెప్తూ వస్తున్న ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా మైదానమని, దీని సీటింగ్‌ ‌కెపాసిటీ 1,32,000 అని అమిత్‌ ‌షా అన్నారు. 1,10,000 సీట్ల కెపాసిటీతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ ‌స్టేడియంగా, ప్రపంచంలో రెండవ పెద్ద స్పోర్టస్ ‌స్టేడియంగా వార్తలు వచ్చాయి.

Leave a Reply