ప్రపంచ మాత
విశ్వ శాంతి దూత
ప్రసిద్ధ నోబెల్ గ్రహీత
ఆమె.. మదర్ థెరిసా
ఆ కంటి చూపులో…
కరుణత్వం వర్శిస్తుంది
ఆ చిరు నవ్వులో..
దాతృత్వం నర్తిస్తుంది
ఆ చేతి స్పర్శలో..
లాలిత్వం విరుస్తుంది
ఆ పలకరింపులో..
ప్రేమత్వం ద్వనిస్తుంది
ఆ ప్రశాంత వదనంలో
దైవత్వం ప్రసన్నిస్తుంది
ఆ పవిత్ర హృదిలో..
మానవత్వం పరిమళిస్తుంది
అనాధలు, అభాగ్యులను
నిర్మల్ హృదయం స్థాపించి
ఆశ్రయమిచ్చిన కరుణామయి
రసి కారుతున్న కుష్టు రోగుల్లో
ఆశలు రేకెత్తించిన స్ఫూర్తిమయి
యావజ్జీవితం సమాజ సేవకు
అంకితం చేసిన త్యాగమయి
మదర్ థెరిసా…
ఇల నడయాడిన దేవత
విశ్వ జగతికి మహిమాన్విత
ఆ అమ్మ మాటలు ఆచరిస్తూ…
ఆ అడుగు జాడల్లో నడుస్తూ…
సమాజ సేవలో పునీతమవుదాం
మానవతను లోకమెల్లా చాటుదాం
– కోడిగూటి తిరుపతి, :9573929493