Take a fresh look at your lifestyle.

అన్నింటికంటే విలువైంది మనిషి ఆరోగ్యం

Most important of all is man's health says Finance Minister Harish Rao

  • మీరందరూ ఆరోగ్యంగా
  • ఉండాలన్నదే నా ఆలోచన
  • అభివృద్ధి చేయడం మా వంతు..
  • మీ వార్డును పరిశుభ్రంగా చేయడం మీ వంతు..
  • ముస్తాబాద్‌ ‌సర్కిల్‌ ‌టూ గాడిచర్లపల్లి నాలుగు లేన్ల రోడ్డు
  • రూ.16.50కోట్ల రూపాయలతో వీధి దీపాలు
  • గాడిచర్లపల్లిపై వరాల జల్లు కురిపించిన ఆర్థిక మంత్రి హరీష్‌రావు

ప్రజాతంత్ర బ్యూరో, సిద్ధిపేట : అన్నింటికంటే విలువైంది మనిషి ఆరోగ్యం. నా సిద్ధిపేట ప్రజలు బాగుండాలి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలన్నదే నా ప్రధాన లక్ష్యం. స్వచ్ఛ సిద్ధిపేట కావాలి. మీరంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే నా ఆలోచన. ఆరోగ్య సిద్దిపేట మన లక్ష్యంగా పెట్టుకుని తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి ఇవ్వాలని గాడిచర్లపల్లి ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. శనివారం స్పెషల్‌ ‌గ్రేడ్‌ ‌మున్సిపాలిటీ 29వ వార్డు గాడిచర్లపల్లి పరిధిలో గల ఎస్సీ కాలనీలో 13లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని, రూ.17లక్షల వ్యయంతో నిర్మించిన 2వ మహిళా సమాఖ్య భవనాన్ని, రూ.11లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, మార్కెట్‌ ‌కమిటీ ఛైర్మన్‌ ‌పాల సాయిరాం, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రారంభించారు.అలాగే, మున్సిపల్‌ ‌వార్డులో పర్యటించారు. అనంతరం సిద్ధిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆయా వార్డుల్లోని ప్రజలకు తడి, పొడి చెత్త వేరు చేయుటకై చెత్తబుట్టలు, జూట్‌ ‌బ్యాగులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ముస్తాబద్‌ ‌సర్కిల్‌ ‌నుంచి గాడిచర్లపల్లికి వచ్చే ప్రధాన రహదారిని నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించడంతో పాటు రూ.16.50కోట్ల వ్యయంతో వీధి దీపాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. నెలలోపు వార్డుకు వచ్చే ప్రధాన రోడ్డును డాంబర్‌ ‌రహదారిగా మార్చుతామనీ, త్వరలోనే వార్డులో సిసి రోడ్లు వేయిస్తానని హామీనిచ్చారు. ఆరోగ్యమే మహా భాగ్యంగా భావించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందనీ, మనం తినే ఆహారపు అలవాట్లు గురించి వివరించి ఔషధ ఆహారం తినే విధంగా మారొద్దన హితవు పలికారు.

తినే ప్రతి ఆహారంలో పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు. గాడిచర్లపల్లిలో మాట ఇచ్చిన ప్రకారం రెండు మహిళా భవనాలు, అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించుకున్నామనీ, సిద్దిపేట పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త వేరుకోసం 38వేల చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్నామనీ వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్లాస్టిక్‌ ‌నియంత్రణ కోసం ప్రతి ఇంటీకి జూట్‌ ‌బ్యాగ్‌లు కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్‌ ‌వాడకం వల్ల కలిగే అనార్థాలు వివరించారు. నాగులబండ వద్ద రూ.7 కోట్లతో ఎల్వీ ప్రసాద్‌ ‌కంటి ఆసుపత్రిని ఏర్పాటైందనీ, పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతున్న విషయాన్ని తెలిపారు. పైసా ఖర్చు లేకుండా మీరు కంటి పరీక్షలు చేయించుకోవచ్చనీ, అవసరమైన వారిని తీసుకెళ్లి కంటి పరీక్షలు చేయించాలని కౌన్సిలర్‌ ఉమారాణికి సూచించారు. ఇవాళ ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఇంటింటికీ వేప, పండ్ల చెట్లు పంపిస్తామని, మీ ఇంటి ముందు ఉన్న చెట్టు సంరక్షిస్తామని, ఇంటి ముందు ఉన్న చెట్టు గురించి ఆలోచన చేయాలన్నారు. అదే విధంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వాలని ప్రజలను మంత్రి కోరారు. ఇంటింటా సేకరించిన తడి చెత్త ద్వారా సేంద్రీయ ఎరువులు, వర్మీ కంపోస్టు, పొడి చెత్త ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్లాస్టిక్‌ ‌కవర్లు వాడొద్దని జూట్‌ ‌బ్యాగులు పంపిణీ చేస్తున్నామన్నారు. 57 ఏళ్లు నిండినవృద్ధులకు ఆసరా ఫించను ఇచ్చే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8లక్షల మంది ఉంటారని అంచనాలు ఉన్నాయని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.