Take a fresh look at your lifestyle.

ఏ‌ప్రిల్‌ ఆఖరు వారంలో అత్యధిక మరణాలు ..!

  • మే నెల అత్యంత ప్రమాదకరం
  • వైరస్‌ ‌నియంత్రణ ఇప్పట్లో సాధ్యం కాదంటున్న నిపుణులు

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ,ఏప్రిల్‌ 29: ‌ప్రస్తుతం భారతదేశం కొరోనా వైరస్‌ ‌మహమ్మారికి కేంద్రంగా ఉంది. ఏప్రిల్‌ ‌నెల మహమ్మారి నెలగా పేరు తెచ్చుకుంది. గత 24 గంటల వ్యవధిలో..బుధవారం .. దాదాపు 3,79,257 కొత్త కేసులను భారత్‌ ‌నమోదు చేసింది.మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఏప్రిల్‌ అత్యంత ప్రాణాంతకమైన నెల గా కనిపిస్తుంది.ఏప్రిల్‌ ‌నెలలో సంభవించిన మరణాల మొత్తం లో సగం ఏప్రిల్‌ ‌నెల ఆఖరి వారం లో సంభవించాయి.ఇది భారత్‌ ‌సాధించిన కొత్త మహమ్మారి ప్రపంచ రికార్డు. భారతదేశం కోవిడ్‌ -19 ‌కర్వ్‌హొ దాదాపు నిట్ట నిలువుగా ఉన్నది.ఏప్రిల్‌ ‌లో ప్రతి రోజు భారతదేశానికి అత్యంత ఘోరమైన రోజుగా పరిణమించింది. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా కావచ్చు అని ఆందోళన కొనసాగుతున్నది. భారతదేశంలో పరిస్థితి మెరుగుపడకపోతే, జూన్‌ ‌నాటికి రోజువారీ 2,300 మంది మరణించవచ్చని కొత్త లాన్సెట్‌ అధ్యయనం హెచ్చరిస్తున్నది.ప్రస్తుత సంక్షోభాన్ని హ్యాండిల్‌ ‌చేసిన తీరుపై నరేంద్ర మోడీ విమర్శలు మూట కట్టుకుంటున్నారు. రెండవ వేవ్‌ ‌లో కొత్త వేరియంట్‌ ‌వ్యాప్తికి జరుగుతున్నది. గత సంవత్సరం చివరినాటికే భయంకరమైన రెండవ వేవ్‌ ‌రానున్న కాలంలో ఉంటుందని తెలిసినప్పటికీ రానున్న విపత్తును ఎదుర్కోటానికి ప్రభుత్వం తగురీతిగా సంసిద్ధం కాలేదు. ప్రస్తుతం ‘‘భారతదేశం ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోంది’’. ప్రజారోగ్య పరిస్థితి చేజారి భయంకరంగా ఉంది. వ్యాధి వ్యాప్తి మరణాల సంఖ్య బరువుతో భారతదేశం కుప్పకూలిపోతోంది. హాస్పిటల్స్ ఆక్సిజన్‌ ‌లేమితో ఉన్నాయి. కనీసం పడకలు లేవు.

రోగులు పడకలను పంచుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వదేశమైన గుజరాత్‌ ‌లో శ్మశానవాటికలు కొలిమిలుగా రగులుతున్నాయి. భారతదేశం జనవరిలో సామూహిక టీకాల ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ, ప్రస్తుతం టీకా కొరతను భారత్‌ ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభంలో మిలియన్ల టీకాలను విదేశాలకు భారత్‌ ఎగుమతి చేసింది.ఈ ఘోర పరిస్థితికి కారణం ఏమిటి…? అనే ప్రశ్నకు నిపుణులు చెప్పే సమాధానం యూ కే వేరియంట్‌ ‌వ్యాప్తికి కారణం జనసందోహం అని చెబుతున్నారు. రాష్ట్రల ఎన్నికల ర్యాలీలు జనసందోహం అడ్డాలుగా కిటకిటలాడుతూ కొంతకాలం ప్రహసనంగా కొనసాగాయి. హిందూ పండుగ కుంభమేలా ఏప్రిల్‌ ‌నెలలో లక్షలాది మందిని గంగా నది ఒడ్డుకి ఆహ్వానించింది. వీటివలన వేలాది కొత్త వేరియంట్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. ఆ తరవాత భారతీయ స్ట్రైన్‌ ఆవిర్భావం జరిగి భారత్‌ ‌లో కొరోనా వైరస్‌ ‌విలయతాండవానికి అతిపెద్ద కారణం అయినది. మార్చిలో వచ్చిన ఒక ప్రభుత్వ ప్రకటన ‘‘రోగనిరోధక శక్తిని హస్తగతం చేసుకోండి అంటువ్యాధి నుంచి తప్పించుకోండి’’ ఈ ప్రకటనతో కొత్త వైవిధ్యాల వైరస్‌ ‌గురించి భారత ప్రభుత్వం హెచ్చరించింది. వాస్తవానికి, భారతీయ స్ట్రైన్‌ అక్టోబర్‌ ‌వరకు కూడా తన ప్రభావాన్ని చూపవచ్చు.దాదాపు 20 మిలియన్ల మంది భారతీయులకు పూర్తిగా టీకాలు అందాయి. అయితే 1 బిలియన్‌ ‌కంటే ఎక్కువ జనాభా ఉన్న భారత్‌ ‌లో కేవలం 1 శాతంకి మాత్రమే టీకా అందినది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారంతా టీకా వేయించుకోటానికి అర్హులు అని మోడీ ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఈ టీకా విస్తరణ టీకా కొరతను మరింత పెంచుతుంది. మంగళవారం నాటి ప్రసంగంలో ప్రధాని మోడీ ఆక్సిజన్‌ ‌మరియు ఇతర అత్యవసర సామాగ్రిని పెంచుతామని శపథం చేస్తూ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే కార్యరూపం దాల్చటం చాలా కష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే అత్యవసర సామాగ్రి లేకుండా, భారతీయ వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రశ్నార్థకంగా ఉంది. వ్యాక్సిన్ల కోసం ముడి పదార్థాలపై యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌పై భారత్‌ ఆధారపడి ఉన్నది. అమెరికా ముడి సరుకు ఇవ్వను అంటే భారత్‌ ‌లో గుబులు రేగే పరిస్థితి. భారతదేశం కొరోనావైరస్‌ ‌సంక్షోభం అంతర్జాతీయ దేశాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తున్నది. భారతీయ ప్రయాణికులు హాంకాంగ్‌ ‌వంటి తక్కువ ఇన్ఫెక్షన్‌ ‌రేట్లు ఉన్న దేశాలకు వైరస్‌ ‌నుహొహొమోసుకుపోయారు అని వార్తలు వస్తున్నాయి. టీకా ఎగుమతికి సంబంధించి కొన్ని దేశాలు భారత్‌ ‌వైపు చూస్తున్నాయి. భారత్‌ ‌లో జరిగే టీకా ఉత్పత్తి కోసం భారతీయ ప్రజలు మాత్రమే కాదు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు వేచి చూస్తున్నాయి. ప్రస్తుతం ఎదురవుతున్న కొత్త ప్రమాదం పశ్చిమ బెంగాల్‌లో ఈ వారం కనుగొనబడిన మరో వేరియంట్‌ ‌భారతదేశానికి అత్యంత ప్రమాదకారిగా మారనున్నది అని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. కొన్ని రాష్ట్రాలు సంక్షిప్త కర్ఫ్యూలను ప్రకటించాయి. పరిస్థితి విషమించితేహొలాక్‌ ‌డౌన్‌ ‌చివరి ప్రయత్నంగా మాత్రమే అమలు చేయాలని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. కొరోనా వైరస్‌ ‌విస్తరణను నియంత్రించడానికి భారతదేశంకి ఇంకా సమయం పడుతుండటంతో మహమ్మారి పీడకల ఎప్పుడు ముగుస్తుందా అని ప్రజలు వేచి చూస్తున్నారు.

Leave a Reply