Take a fresh look at your lifestyle.

దిల్లీ లో 2021 లో తొలిసారి అత్యధిక కొరోనా కేసులు..!

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌ళ్ళీ కొరోనా విజృంభ‌ణ‌ మొదలైంది.ఈ ఏడాదిలోనే తొలిసారి అత్యధిక కేసులు రికార్డు అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కొరోనా వైరస్ మ‌ళ్ళీ విజృంభిస్తోంది. కొద్ది నెలల క్రితం త‌క్కువగా నమోదైన కేసులు, వారం రోజులుగా విప‌రీతంగా పెరుగుతున్నాయి.ఈ సంవ‌త్స‌రంలోనే నిన్న శనివారం తొలిసారిగా ఢిల్లీలో అత్యధిక రోజువారీ కేసులు నమోదైనట్టు రికార్డులు చెబుతున్నాయి.

అత్యధికంగా అంటే 813 కొత్త కేసులు నమోదు కావడంతో ఢిల్లీ సర్కార్ లో కలవరం మొదలైంది. కొరోనా కట్టడిలో దేశంలోనే ఢిల్లీ సర్కార్ అగ్ర‌భాగాన నిలిచిన విష‌యం మనకు తెలిసిందే. కొ‌రోనా సోకినా మరణాల సంఖ్య ను తగ్గించడంలో అర‌వింద్‌ కేజ్రీవాల్ సర్కార్ ప్రశంసలు పొందింది. అయితే, ప్రస్తుతం కొరోనా కేసులు పెరుగుతుండడంపై ఢిల్లీలో ఆందోళన మొదలైంది.

తాజా రికార్డుల ప్రకారం పాజిటివిటీ రేటు 1.07 శాతంగా నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. కోవిడ్ 19 ప్రభావంతో ఇద్దరు మృత్యువాత పడగా, ప్రస్తుతం ఢిల్లీలో 3, 165 మంది కొరోనా బాధితులు ఉన్నట్టు తెలిపారు.

Leave a Reply