Take a fresh look at your lifestyle.

ఫాస్ టాగ్ ద్వారా రోజుకి 100 కోట్లకు పైగా వ‌సూలు: మంత్రి గ‌డ్క‌రీ

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ: టోల్‌ప్లాజా వ‌ద్ద వ‌సూలు చేసే ఫాస్ టాగ్ ద్వారా రోజుకి 100 కోట్లకు పైగా వ‌సూలు చేసినట్టు రాజ్య‌స‌భ‌లో కేంద్ర రవాణా మంత్రి గ‌డ్క‌రీ తెలిపారు. దేశ‌వ్యాప్తంగా ఫాస్ ట్యాగ్ ద్వారా రోజుకి 100 కోట్లు పైగా వ‌సూలు అవుతుంద‌ని కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ వెల్ల‌డించారు. కాగా, మార్చి 16వ తేదీ వ‌ర‌కు దేశ‌మంతా సుమారు మూడు కోట్ల మంది వాహ‌న వినియోగ‌దారుల‌కి ఫాస్ ట్యాగ్ ఇష్యూ చేసిన‌ట్టు వివ‌రించారు. రానున్న కాలంలో ఈ సంఖ్య ఇంకా పెరుగుతంద‌ని మంత్రి తెలిపారు. సోమ‌వారం రాజ్య‌స‌భ‌లో బీజేపీ ఎంపీ మ‌హేష్ పొద్ద‌ర్ లెవ‌నెత్తిన ప్ర‌శ్న‌కి మంత్రి లిఖిత‌ స‌మాధానం ఇచ్చారు.

వాహ‌నదారుల నుంచి రోడ్డు టోల్‌ప్లాజా వ‌ద్ద వ‌సూలు చేసే నిధుల నిర్వ‌హ‌ణ‌ని మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త చేసేందుకు ఫాస్ ట్యాగ్ పేరుతో డిజిట‌లైజ్ చేసిన‌ట్టు తెలిపారు. ఈ చ‌ర్య‌లు వేగంగా అమ‌లుప‌రుస్తున్న‌ట్టు మంత్రి తెలిపారు. సెంట్ర‌ల్ మెటార్ వెహిక‌ల్ రూల్స్-1989 ప్ర‌కారం ప్ర‌స్తుతం దేశ‌మంతా ఫాస్ ట్యాగ్ ను త‌ప్ప‌నిస‌రి చేసిన‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఫిబ్ర‌వ‌రి 15 త‌ర్వాత ఫాస్ ట్యాగ్ లేని వాహ‌న‌దారులు సంబంధిత టోల్ ప్లాజా వ‌ద్ద రెట్టింపు ధ‌ర‌ని చెల్లించాల్సి ఉంటుంద‌ని మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు.

Leave a Reply