Take a fresh look at your lifestyle.

దేశంలో నాలుగులక్షలు దాటిన కేసులు

  • రెండున్నరవేలకు చేరువలో మరణాల సంఖ్య
  • మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని హెచ్చరిక

పలువురు నిపుణులు అంచనా వేసిన విధంగానే దేశంలో కోవిడ్‌ ‌కేసులు నాలుగు లక్షలను దాటేశాయి. మరోవైపు మృత్యు ఘోష కూడా అదే స్థాయిలో వినిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 4,12,262 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏ దేశంలో నమోదు కానన్ని కేసులు భారత్‌లో వెలుగుచూస్తున్నాయి. ఈ సంఖ్య భారత రికార్డుతో పాటు ప్రపంచ రికార్డు. గత 24 గంటల్లో 3,980 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 2,10, 77,410 మంది కరోనా బారిన పడ్డారు. 2,30, 168 మంది బలయ్యారు. కాగా, గడిచిన 24 గంటల్లో 3,29,113 డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా రికవరీ అయిన కేసుల సంఖ్య 1,77, 80, 844గా ఉంది. ప్రస్తుతం దేశంలో 35,66,398 క్రియాశీలక కేసులు ఉన్నాయి. యథావిధిగానే మహారాష్ట్రలో అత్యధికంగా 57,640 కేసులు, కర్ణాటకలో 50,112, కేరళ 41,953, ఉత్తరప్రదేశ్‌ 31,111, ‌తమిళనాడులో23,310 కేసులు నమోదయ్యాయి. రోజు వారీ నమోదు అవుతున్న కొత్త కేసుల్లో ఈ ఐదు రాష్టాల్ర నుండే వెలుగుచూస్తున్నాయి.

ఈ రాష్ట్రాల నుండి 49.52 శాతం కేసులు పుట్టుకొస్తున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 13.98 శాతం కొత్త కేసులు నమోదవుతున్నాయి. అత్యధిక మరణాలు కూడా ఈ రాష్ట్రంలో సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ 920 మంది మరణించగా.. దాని తరువాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ (353) ఉం‌ది. అసోం, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌, ‌బీహార్‌లో రోజువారీ నమోదౌతున్న కేసుల సంఖ్య, మరణాలు పెరుగుతున్నాయి. భారత్‌లో కొరోనా వైరస్‌ ‌రెండో దశ విరుచుకుపడుతోంది. కోవిడ్‌ ‌కట్టడికి ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ రోజువారీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోసారి దేశంలో కొత్త కేసులు నాలుగు లక్షలు దాటాయి. ఇదిలావుంటే కొరోనా రెండో ప్రభంజనంతోనే అల్లాడుతున్న ప్రజలకు  కొరోనా మూడో వేవ్‌ ‌ముప్పు కూడా తప్పదని.. దాన్ని ఎదుర్కోవడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్‌ ఇప్పటికే హెచ్చరించారు. అయితే, మూడో వేవ్‌ ఎప్పు‌డు వస్తుందనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. వైరస్‌ ‌రోజురోజుకూ రూపుమార్చుకుని కొత్త స్టెయ్రిన్ల రూపంలో అవతరిస్తున్నందున, మరిన్ని వేవ్‌లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

మే 7కు సెకండ్‌ ‌వేవ్‌ ‌పతాకస్థాయికి చేరుకుంటుందని, ఈ వారాంతం నుంచి క్షీణించడం మొదలవుతుందని విజయరాఘవన్‌ ‌తెలిపారు. కొన్ని రాష్టాల్లో్ర మాత్రం ఇంకా పతాకస్థాయికి చేరలేదని చెప్పారు. ఏడు రోజుల సగటు ఆధారంగా ఈ అంచనా వేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న టీకాలకు కొత్త వేరియంట్లను కూడా ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. వైరస్‌ ఉత్పరివర్తనాలపై నిఘా కొనసాగించాలని, కొత్త మ్యుటేషన్లను సమర్థంగా ఎదుర్కొనేలా టీకాలను నవీకరించుకోవాలని విజయరాఘవన్‌ ‌సూచించారు.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడమూ కారణాలేనన్నారు. వైర్‌సను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్‌కి సంబంధించి, సన్నద్ధతకు సంబంధించి వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరూ మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Leave a Reply