కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుశీల్ చంద్ర
న్యూ దిల్లీ, జనవరి 25 : దేశంలో 95.3 కోట్ల మందికిపైగా వోటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుశీల్ చంద్ర అన్నారు. మంగళవారం జరిగిన నేషనల్ వోటర్సుడే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మరో 1.92 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారని సీఈసీ వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వొచ్చిన నాటి నుంచి భారతీయులు తమ వోటు హక్కును వినియోగించుకుంటున్నారని, వోటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నారని ఆయన తెలిపారు.
కేవలం 18 శాతం అక్షరాస్యతా ఉంది. కొత్తగా స్వాతంత్య్రం సాధించుకున్న దేశం వేగవంతమైన అభివృద్ధికి ఈ రైట్టు వోట్ ఎంతో తోడ్పడిందని ఆయన చెప్పారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేశామన్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల పక్రియను ప్రశాతంగా పూర్తి చేస్తానని సీఈసీ చెప్పారు.