Take a fresh look at your lifestyle.

70 ‌శాతానికి పైగా భవనాలను పూర్తి

  • అసంపూర్తిగా వున్న భవనాలకు 2154 కోట్లు అవసరం
  • అమరావతి భవనాల నిర్మాణాలపై ఏర్పాటైన కమిటీ భేటీ

ఏపీ రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎస్‌ ఆదిత్యనాథ్‌ ‌దాస్‌ ‌నేతత్వంలోని కమిటీ తొలి సమావేశం జరిగింది. శాసన రాజధానికి సంబంధించిన అసంపూర్తి భవనాల నిర్మాణంపై కమిటీ చర్చించింది. రాజధాని పరిధిలోని భవనాలు ఏ మేరకు పూర్తయ్యాయి అనే అంశంపై కమిటీకి ఎఎంఆర్‌డీఏ అధికారులు వివరించారు. అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణానికి రూ. 2154 కోట్లు నిధుల అవసరమని ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంట్రాక్టర్ల చెల్లింపుల నిమిత్తం సుమారు రూ. 300 కోట్లు అవసరమని కమిటీ ఓ నిర్ధారణకు వచ్చింది. 288 ఎ•-లాట్లల్లో 74 శాతం పూర్తయినట్టు ఎఎంఆర్‌డీఏ పేర్కొంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాల్లో 288 ఎ•-లాట్లు చేపట్టాల్సింది ఉందని, 144 ఎ•-లాట్లలో 74 శాతం మేర నిర్మాణాలు పూర్తి చేసినట్టు వెల్లడించింది.

అఖిల భారత సర్వీస్‌ అధికారుల భవనాల్లో 144 ఎ•-లాట్లు చేపట్టాల్సి ఉందని, ఎన్జీవో హౌసింగ్‌లోని 1,968 ఎ•-లాట్లలో 62 శాతం పూర్తయినట్టు ఎఎంఆర్‌డీఏ స్పష్టం చేసింది. అసంపూర్తి నిర్మాణాలకు సంబంధించి నిధుల సవి•కరణ విషయంలో బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో సమావేశమవ్వాలని ఎమ్మార్డీఏని కమిటీ ఆదేశించింది. ఇక 70 శాతానికి పైగా పూర్తయిన భవనాల నిర్మాణాన్ని ముందుగా పూర్తి చేయాలని కమిటీ సూతప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. మార్చి రెరడో వారంలో రెరడోసారి కమిటీ భేటీ కావాలని నిర్ణయించింది. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ ‌దాస్‌ ‌నేతత్వంలో నిన్ననే తొమ్మిది సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఇవాళ సమావేశమైన కమిటీ.. రాజధాని ప్రాంతంలోని అసంపూర్తి భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల అంచనాపై సవి•క్ష నిర్వహించింది.

- Advertisement -

ఏపీ సీఎస్‌ ‌నేతత్వంలో కీలక భేటీ
ఆంధ్ర ప్రదేశ్‌ ‌సీఎస్‌ ‌నేతత్వంలో కీలక భేటీ జరిగింది. శాసన రాజధానికి సంబంధించిన అసంపూర్తి భవనాల నిర్మాణంపై చర్చ జరిగినట్టు చెబుతున్నారు. సీఎస్‌ ‌నేతత్వంలో నిన్ననే తొమ్మిది మంది సభ్యులతో ప్రభుత్వం కమిటీ వేసింది. రాజధాని ప్రాంతంలోని అసంపూర్తి భవనాల నిర్మాణానికి నిధుల అంచనాపై సమిక్ష అవసరమని పేర్కొన్నారు. ఏయే భవనాలు అవసరం.. ఏయే భవనాలు అనవసరం అనే జాబితాను సీఎస్‌ ‌నేతత్వంలోని కమిటీ సిద్జం చేయనుంది.

శాసన రాజధానికి అవసరమైన భవనాల నిర్మాణాన్ని మాత్రమే పూర్తి చేయాలని జగన్‌ ‌సర్కార్‌ ‌భావిస్తూ, సెక్రటేరీయేట్‌, ‌హూచ్వోడీ, శాశ్వత హైకోర్టు భవన నిర్మాణాల కొనసాగింపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఏఎమ్మార్డీఏ కమిషనర్‌ ‌కోరారు. దీంతో శాసన రాజధానికి అవసరమైన భవనాలు, హౌసింగ్‌ ‌యూనిట్ల నిర్మాణం.. ఖర్చు తగ్గించుకునేలా సీఎస్‌ ‌నేతత్వంలోని కమిటీ ప్రణాళికల రూపకల్పనపై అధ్యయనం చేయనుంది. కమిటీలో సభ్యులుగా అసెంబ్లీ కార్యదర్శి, ఎమ్మార్డీఏ కమిషనర్‌ ‌సహ జీఏడీ, పట్టణాభివద్ధి, న్యాయ, ఆర్థిక, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.

Leave a Reply