Take a fresh look at your lifestyle.

వరుసగా రెండోరోజూ 3వేలకు పైగా మరణాలు

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కొరోనా కేసులు
దేశంలో కొరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. వైరస్‌ ‌విజృంభణతో పాజిటివ్‌ ‌కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా మూడు లక్షలకుపైగా మంది కొరోనా బారినపడుతున్నారు. వరుసగా రెండో రోజూ మూడు వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కొరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. కొరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రికార్డ్ ‌స్థాయిలో కొరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కేసుల సంఖ్య 3,79,257కి చేరింది.ఇందులో 1,50,86,878 మంది కోలుకొని డిశ్చార్జ్ ‌కాగా, 30,84,814 కేసులు యాక్టివ్‌ ‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొరోనాతో 3645 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కొరోనా మరణాల సంఖ్య 2,04,832కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,69,507 మంది కోలుకొని డిశ్చార్జ్ ‌కాగా, ఇప్పటి వరకు మొత్తం 15,00,20,648 మందికి వ్యాక్సిన్‌ అం‌దించారు. రోజువారీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో యాక్టివ్‌ ‌కేసులు కూడా పెరిగిపోతున్నాయి.

దీంతో దేశంలో యాక్టివ్‌ ‌కేసులు 30 లక్షలకుపైగా ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంత మంది బాధితులు చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కొరోనా మరణాలు 2,04,8320కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15,00,20,648 మందికి కొరోనా టీకా పంపిణీ చేశామని తెలిపింది. మహారాష్ట్రలో నిన్న 63,309 కొరోనా కేసులు నమోదవగా 985 మంది మరణించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో 29,824, ఢిల్లీలో 25,986 మంది కరనాబారినపడ్డారు. కర్ణాటకలో 39,047, కేరళలో 35,103 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇలా దేశంలోని 14 రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బుధవారం రికార్డు స్థాయిలో కొరోనా కేసులు రికార్డయ్యాయి.

దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 17,68,190 మందికి కొరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి ఐసీఎమ్మార్‌ ‌ప్రకటించింది. దీంతో ఏప్రిల్‌ 28 ‌వరకు 28,44,71,979 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా యాక్టివ్‌ ‌కేసులు ఉన్న జాబితాలో భారత్‌ ‌రెండో స్థానానికి చేరింది. అత్యధికంగా అమెరికాలో 60 లక్షల 80 వేల మందికిపైగా బాధితులు కొరోనా చికిత్స పొందుతున్నారు. ఇక రెండో స్థానంలో భారత్‌లో 30 లక్షలకుపైగా కేసులు యాక్టివ్‌గా ఉండగా, బ్రెజిల్‌లో 10 లక్షకుపైగా కొరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక ఫ్రాన్స్‌లో యాక్టివ్‌ ‌కేసులు 10 లక్షలకు చేరువలో ఉన్నాయి.

Leave a Reply