Take a fresh look at your lifestyle.

ఉద్యోగాల భర్తీపై ఇంకెన్నాళ్లీ మోసాలు

  • 317 జీఓను సవరించే వరకు వదిలి పెట్టం
  • ప్రజల దృష్టి మళ్లించడానికే ఇంగ్లీష్‌ ‌డియం నాటకం: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌

ప్రజాతంత్ర,హైదరాబాద్‌,‌జనవరి18: తెలంగాణ బీజేపీ చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. సీఎం వాక్సిన్‌ ‌తీసుకున్నాడో లేదో తెలియదని, వాక్సిన్‌ ‌తీసుకొమ్మని చెప్పడు, బీజేపీ ఒత్తిడితో గాంధీ హాస్పిటల్‌కి పోయిండు అని ఆయన అన్నారు. టైమ్‌ ‌పాస్‌ ‌కోసం కేబినెట్‌ ‌టింగ్‌ ‌పెట్టిండని, 317 జీఓపై కేబినెట్‌లో చర్చించక పోవడం దుర్మార్గమని ఆయన అరోపించారు. ఉద్యోగులు వాళ్ల చావు వాళ్ళు చావాలని కేసీఆర్‌ అనుకుంటున్నాడా అని ఆయన విమర్శించారు. 317 జీఓను సవరించే వరకు సీఎంను వదిలి పెట్టమని, మానవత్వం లేని మనిషి కేసీఆర్‌ అం‌టూ సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. కార్పొరేట్‌ ‌స్కూల్స్ ‌నుండి డబ్బులు దండు కోవడానికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు డియమన్నారు. కేసీఆర్‌ ‌కి చిత్త శుద్ధి లేదని, కేసీఆర్‌ ‌వరంగల్‌ ఎం‌దుకు పోలేదో చెప్పాలన్నారు. మోడీ సీఎంలతో సమావేశం పెట్టినప్పుడు ఎందుకు అటెండ్‌ ‌కాలేదని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని, ఉద్యోగులెవ్వరూ భయపడాల్సినవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల కు మద్దతుగా బీజేపీ పోరాటం చేస్తుందని.. జాగరణ దీక్ష ఘటనలో ఇంకా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ ‌చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో 317జీవోను సవరించేవరకు సీఎం కేసీఆర్‌ను వదిలే ప్రసక్తేలేదని బండి సంజయ్‌ అన్నారు.

మంగళవారం ఆయన డియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏమైందో కేసీఆర్‌ ‌గుర్తుచేసుకోవాలని హెచ్చరించారు. బీజేపీ జాతీయ నేతలతో ఉద్యోగ, ఉపాధ్యాయుల వర్చువల్‌ ‌సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కేసీఆర్‌ ‌జాతకం బాగాలేదని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. బీజేపీ అండగా ఉంటోందని భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్‌ ‌కొత్త డ్రామాలు మొదలుపెట్టాడన్నారు. ప్రభుత్వం ఒత్తిడితోనే ఉపాధ్యాయ ఉద్యోగులు విధుల్లో చేరుతున్నా రన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పి హా ఇవ్వలేదని నాలుక మడతవేశారని బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. కరోనాను ఎదుర్కోవడంలో భారతదేశాన్ని ప్రథమస్థానంలో నిలిపిన ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరపున భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బండి సంజయ్‌ ‌జూమ్‌ ‌ద్వారా సమావేశం నిర్వహించారు.

జనవరి 17 వరకే 158 కోట్ల డోసులు పూర్తి అయ్యాయన్న సంజయ్‌.. ‌ప్రపంచంలోనే ఈ స్థాయిలో వ్యాక్సినేషన్‌ ఎక్కడా జరగలేదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. భారత్‌ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేకున్నా కరోనాను విజయవంతంగా ఎదుర్కోగలిగామన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్‌.. ఇప్పు‌డు ఆ హా నెరవేర్చలేక కేంద్రంపై నింద వేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా ముందుకు వెళ్తున్నామని సంజయ్‌ ‌పేర్కొన్నారు. పాఠశాలల్లో సిబ్బంది, మౌలిక సదుపాయాలే లేవు.. ఇంగ్లీష్‌ ‌మాధ్యమం ఎలా అమలు చేస్తారు. ఏడేళ్లలో ఒక్క పాఠశాలనైనా కేసీఆర్‌ ‌సందర్శించారా.. 317జీవో నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్‌ ‌కొత్త నాటకం ఆడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తల్చుకుంటే గతంలో ప్రభుత్వాలే పోయాయి. బిస్వాల్‌ ‌కమిటీ లక్షా 91వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పితే ఎందుకు భర్తీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్‌.. ఇవ్వలేక కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.

Leave a Reply