Take a fresh look at your lifestyle.

సూర్యాపేట అష్టదిగ్బంధనం..! లాక్ డౌన్ అమలు పై మరిన్ని ఆంక్షలు

  • రంగంలోకి దిగిన మంత్రి జగదీష్ రెడ్డి
  • సూర్యపేట పురపలికకు ఓ యస్ డి గా వేణుగోపాల్ రెడ్డి
  • బయటివారికి నో ఎంట్రీ

కరోనా వైరస్ సోకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సూర్యపేట ను అస్తదిగ్బంధనం లో ఉంచాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.సోమవారం అర్ధరాత్రికి కేసుల సంఖ్య పెరిగిందన్న సమాచారం తో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంగళవారం మధ్యాహ్ననీకి సూర్యపేట కు చేరుకున్నారు.పరిస్థితులు ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్న తరుణంలో కేసులు తిరగదొడడం తో మంత్రి జగదీష్ రెడ్డి ఈ ఉదయం నుండే స్వయంగా రంగంలోకి దిగి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.అందులో బాగంగా ఈ మధ్యాహ్నం సూర్యపేట కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అత్యవసర సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి జిల్లాలో ఉత్పన్నమైన పరిణామాలను ఎప్పటికప్పుడు అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు.జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి భాస్కరన్ ,వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు పలువురు పాల్గొన్న ఈ సమీక్ష సమావేశం లో కరోనా కట్టడికి దోహద పడే పలు అంశాల పై చర్చించినారు ఎంఅదే సమయంలో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ఉపశమనం చర్యలు చేపట్టారు. అనూహ్యంగా కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలలో కీ సోకిందన్న అంశం ఈ సమీక్ష సమావేశంలో ప్రధాన చర్చకు వచ్చింది.

ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగరం మండలం వర్ధమాన్ కోటగ్రామానికి చేరిన కరోనా వైరస్ తాజాగా సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని ఏపూర్ గ్రామానికి చేరడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కరోనా వైరస్ లింక్ తెంపాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించి అమలు పరుస్తున్న క్రమంలో పాజిటివ్ కేసులో అనుమానితుడుగా భావిస్తున్న పొరుగు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సూర్యపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఓ విందు కు హాజరైన క్రమంలోనే జిల్లాలో వైరస్ ప్రబలిందన్న కనుక్లూజన్ కు అధికార యంత్రాంగం వచ్చారు. వాటి మూలలను తెంపే ప్రయత్నం లో నిమగ్నమైన అధికారులకు సోమవారం రాత్రి నుండి వస్తున్న సమాచారం తో లాక్ డౌన్ ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.అదే సమయంలో సూర్యపేట ఎతరులను ఎట్టి పరిస్థితుల్లో సూర్యపేట కు అనుమతించారాదని నిర్ణయించారు.అయితే కనీస అవసరాలలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ప్రత్యేక అధికారిగా వేణుగోపాల్ రెడ్డి

ఇదిలా ఉండగా సూర్యపేట మున్సిపాలిటికి ఓ యస్ డి గా సీనియర్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి ని నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఖమ్మం,కరీంనగర్ కార్పోరేషన్ లకు కమిషనర్ గా విధులు నిర్వహించిన వేణుగోపాల్ రెడ్డి కరోనా వైరస్ కట్టడి అయ్యేంత వరకు సూర్యపేట లో ఓ యస్ డి గా విధులు నిర్వర్తిస్తారని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Leave a Reply