Take a fresh look at your lifestyle.

తెలుగు వారిని రప్పించేందుకు మరిన్ని విమానాలు

అమరావతి,జూన్‌ 11 :  ‌విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని స్వస్థలాలకు తీసుకురావాలని ఏపీ సీఎం జగన్‌ ‌కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర విదేశాంగ శాఖకు ఒక లేఖను రాసారు. లాక్‌డౌన్‌తో సింగపూర్‌, ‌గల్ఫ్, ఇతర దేశాల్లో అనేక మంది  తెలుగువారు అక్కడే ఉండి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

’వందే భారత్‌’ ‌మిషన్‌ ‌పేరిట ప్రారంభించిన విమాన సేవలను ఉపయోగించి తెలుగువారిని స్వదేశానికి తీసుకురావాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ ‌కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని రప్పించేందుకు మరిన్ని విమానసర్వీసులను నడపాలని ఈ సందర్బంగా  ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్, ‌సింగపూర్‌ ‌దేశాల్లో ఎక్కువ మంది తెలుగువారు చిక్కుకుపోయారని వారందరినీ తరలించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply