Take a fresh look at your lifestyle.

కరోన వ్యాప్తి నివారణకు మరిన్ని చర్యలు అవసరం

ఖమ్మం సిటి, జూన్‌ 17, (‌ప్రజాతంత్ర విలేకరి) : ఖమ్మం జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం బుధవారం ఖమ్మం నగరంలోని జిల్లా పరిషత్‌ ‌సమావేశం మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో  మనం ఎదుర్కోంటున్న ప్రదాన సమస్య కరోనా అని చెప్పారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నివారణ చర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైరస్‌ ‌కట్టడిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌, ‌జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. కరోనా వైరస్‌ ‌కట్టడికి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విధిగా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు, ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నివారణ చర్యలు సూచించారు.

అనంతరం వానాకాలం పంటలు,ఎరువులు,  విత్తనాల లభ్యత, రైతుబందు వేదికల నిర్మాణం తదితర అంశాలపై పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌లింగాల కమల్‌రాజ్‌, ఎంఎల్‌సి బాలసాని లక్ష్మీనారాయణ, పాలేరు శాసనసబ్యులు కందాళ ఉపేందర్‌రెడ్డి,  కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌, ‌జిల్లా పరిషత్‌ ‌సిఇఓ ప్రియాంక, డిసిసిబి చైర్మన్‌ ‌కూరాకుల నాగభూషణం, జిల్లా వ్యవసాయ  అధికారిణి ఝాన్సీలక్ష్మీ కుమారి, జిల్లా వైద్యఆర్యోగశాఖాధికారి డాక్టర్‌ ‌మాలతి పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!