Take a fresh look at your lifestyle.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటే ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి

రైతుల పోరాటంపై కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాందీ

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న కొందరు రైతులు అసువులుబాయడంపై కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను రద్దు చేయడానికి ముందు ఇంకా ఎందరు రైతులు తమ ప్రాణాలను త్యాగం చేయాలని ప్రశ్నించారు. రైతులు మరణించినట్లు చెప్తున్న వి•డియా కథనాలను ఆయన ఉటంకించారు. ఈ వ్యవసార రంగ చట్టాలను రద్దు చేయడానికి ముందు ఇంకా ఎందరు రైతు సోదరులు ప్రాణ త్యాగం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్‌ ‌గాంధీ నిలదీశారు.

నూతన వ్యవసాయ చట్టాలు తమకు నష్టం కలిగిస్తాయని రైతులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాలకు వ్యతిరేకంగా 17 రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అనేక దఫాలుగా జరిపిన చర్చలు సత్ఫలితాలు ఇవ్వలేదు. చర్చలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం చెప్తోంది. అదే సమయంలో నిరసనలను ఉద్ధృతం చేస్తామని రైతులు ప్రకటించారు. రైళ్ళ రాకపోకలకు ఆటంకం కలిగేవిధంగా రైలు పట్టాలపై నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా ప్రశ్నించారు.

Leave a Reply