Take a fresh look at your lifestyle.

ఆరోగ్యశ్రీలో మరిన్ని ఖరీదైన సేవలు

కిడ్నీ, హార్ట్, ‌లివర్‌ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్లకు చోటు
మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు వెల్లడించిన మంత్రి ఈటెల

 ఆరోగ్య శ్రీ పరిధిలోకి కిడ్నీ, హార్ట్, ‌లివర్‌ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను తీసుకురావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌తెలిపారు. ప్రస్తుతం కేవలం నిమ్స్, ‌గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ లోనే  మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు కొనసాగుతున్నాయని, వీటిని మెడికల్‌ ‌కాలేజీల అనుబంధ హాస్పిటల్స్ కు విస్తరింపజేస్తామని మంత్రి తెలిపారు. కిడ్నీ, హార్ట్ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల ఖర్చు అవుతుందని ఇది పేదలకు భారంగా మారిందన్నారు. ఈ క్రమంలో ఈ మూడింటిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చి.. పేదలపై రూపాయి భారం పడకుండా ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి అవసరమైతే చట్టంలో కూడా మార్పులు చేస్తామన్నారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో వైద్యారోగ్య శాఖ బలోపేతానికి సీఎం కేసీఆర్‌ ‌నియమించిన కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, ‌కేటీఆర్‌, ‌తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు సంబంధిత అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. పలు ప్రతిపాదనలకు కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నివేదికను సీఎం కేసీఆర్‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అం‌దజేయనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిని మంత్రి ఈటెల  వైద్యారోగ్య శాఖ 365 రోజులు నిరంతరం పని చేస్తుందని పేర్కొన్నారు.
eetela rajender arogya sree
వైద్యశాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కొవిడ్‌ ‌నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైతే ఆరోగ్య శాఖ మాత్రం ప్రజా సేవలో నిమగ్నమైందని మంత్రి ఈటల తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య శాఖలో అనేక సంస్కరణలు తెచ్చామని తెలిపారు. తెలంగాణ వచ్చే నాటికి మాతా శిశుమరణాల రేటు 92 ఉంటే, ప్రస్తుతం 63కు తగ్గిందన్నారు. ప్రజలకు మేలైన వైద్యం అందిస్తున్న రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు మొదటి, రెండు స్థానాల్లో నిలవగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో  మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు. అన్ని పీహెచ్‌సీలను బలోపేతం చేస్తున్నామని, ప్రతి హాస్పిటల్  లో సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐతో పాటు ఎక్స్ ‌రే సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్యాన్సర్‌ ‌రోగుల కోసం ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నగరంలో బస్తీ దవాఖానాలు విజయవంతంగా పని చేస్తున్నాయని మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. మొత్తం 300ల బస్తీ దవాఖానాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయగా, ఇప్పటికే 198 బస్తీ దవాఖానాలను ప్రారంభించామన్నారు. మరో 26 దవాఖానాలను ఈ నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందడం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి తెలిపారు. 108 అంబులెన్స్‌ల నిర్వహణ మొత్తం ప్రభుత్వ ఖర్చుతోనే కొనసాగుతుం దన్నారు. ప్రతి మండలానికి 108 అంబులెన్స్‌లను సమకూర్చుతామని మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply