Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌సడలింపులతో మరింత అప్రమత్తత

  • ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిందే
  • కార్యాలయాల్లో మరింత జాగరూకతతో విధుల నిర్వహణ
  • లేకుంటే కొరోనా మన ఇళ్లల్లో తిష్టవేయడం ఖాయం
  • హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు

తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ ‌సడలింపులు ఇచ్చారు. దాదాపుగా ఇప్పుడు పూర్తి స్వేఛ్చ కల్పించారు. ప్రజలంతా రోడ్డెక్కుతున్నారు. ఎవరి డ్యూటీల్లో వారు చేరుతున్నారు. పేరుకే 30 వరకు లాక్‌డౌన్‌. ఇక జాగ్రత్తలు పాటించకుంటే కరోనా మన నట్టింట్లో తిష్ట వేయడం ఖాయం. ప్రజలంతా ఎవరికి వారు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇన్నాళ్లుగా అలవాటు చేసుకున్న వ్యక్తిగత పరిశుభ్రత ఇక మనజీవితంలో నిరంరం కావాలి. మాస్కులు కట్టుకోవడం, చేతులను శానిటైజ్‌ ‌చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం అన్నది ప్రధానమని గుర్తించాలి. లాక్‌డౌన్‌ ‌సడలింపుల నేపథ్యంలో ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే కరోనాకు దూరంగా ఉండగలుగుతారని వైద్య విభాగాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు, పని ప్రదేశాల్లో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే కార్యాలయాల్లో ప్రత్యేక విధానాలను అవలంబించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పలు సూచనలు చేసింది. కార్యాలయానికి వచ్చే ప్రతి ఉద్యోగి జ్వరాన్ని తప్పనిసరిగా పరీక్షించాలి. జ్వరం, దగ్గు, జలుబు వంటి ఉంటే అవి తగ్గే వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని చెప్పాలి. పని ప్రదేశంలో గాలి, వెలుతురు బాగా ఉండేలా ఏర్పాట్లుండాలి. శానిటైజర్‌ అం‌దుబాటులో ఉండాలి. రోజుకు 3 నుంచి 4 సార్లు సోడియం హైపోక్లోరైట్‌తో టేబుళ్లు, డోర్‌ ‌హ్యాండిల్స్, ‌హ్యాండ్‌ ‌రేలింగ్‌, ‌నల్లాలు వంటివి శుభ్రం చేయాలి. ఎవరైనా సిబ్బందిలో కరోనా లక్షణాలు కనిపించినా లేదా నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలినా మొత్తం ప్రాంగణాన్ని డిస్‌ ఇన్ఫెక్ట్ ‌ద్రావణంతో శుభ్రం చేయాలి.

కరోనాపై ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ కార్యాలయంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటుచేయాలి. వైరస్‌ ‌సోకకుండా జాగ్రత్త చర్యలు అమలయ్యేలా కార్యాలయంలో నోడల్‌ అధికారిని నియమించాలి.కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులు వ్యక్తిగతంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ‌ధరించాలి. పేపర్లు, ఫైళ్లు, నగదు వంటివి తాకిన ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకోవాలి. తోటి ఉద్యోగులకు 3 నుంచి 5 అడుగుల దూరం ఉండాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు దస్తీ లేదా టిష్యూను అడ్డు పెట్టుకోవాలి. మొబైల్‌ ‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ‌కంప్యూటర్‌ ‌కీబో ర్డు, మౌస్‌ ‌వంటివి ప్రతి 8 గంటల్లో రెండుసార్లు శానిటైజర్‌తో శుభ్రంచేయాలి. రోగనిరోధకశక్తి పెరిగే పోషకాహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. లిప్ట్‌లను సాధ్యమైనంత వరకు ఉపయోగించొద్దు. లిప్ట్‌కు ఎడమచేయి లేదా మోచేతిని వాడాలి. రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ ‌జోన్లలో జూన్‌ 30‌వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ‌కొనసాగుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రకటించారు కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సింది మనమే.

ఇతర ప్రాంతాల్లో జూన్‌ 7‌వ తేదీవరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. రాత్రిపూట రాష్ట్రమంతటా కర్ఫ్యూ కొనసాగుతుంది. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో కంటైన్మెంట్‌ ‌జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్రం సూచించిన సడలింపులు అమలుచేయాలని నిర్ణయించారు. కంటైన్మెంట్‌ ‌జోన్లలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలుచేయాలని, రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 నుం చి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచాలని చెప్పారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై నియంత్రణ అవసరం లేదని చెప్పారు. దీంతో కంటైన్మెంట్‌ ‌జోన్లలో లాక్‌డౌన్‌ ‌నిబంధనలన్నీ కఠినంగా అమలవుతాయి. కంటైన్మెంట్‌ ‌లేని ప్రాంతాల్లో కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. మే 27వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులన్నీ జూన్‌ 7 ‌వరకు కొనసాగుతాయని తెలిపారు. ఇందులో కొన్నింటికి మినహాయింపులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ సమయంలో దవాఖానలు, మెడికల్‌ ‌షాపులకు అనుమతి ఇచ్చారు. మిగతా అన్నిరకాల దుకాణాలు రాత్రి 8 గంటలవరకు తెరుచుకునే వెసలుబాటు ఇచ్చారు. ఇకపై ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి రావడానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని స్పష్టంచేశారు.

Leave a Reply