Take a fresh look at your lifestyle.

మూగవోయిన సరిగమలు

గానమే తన ప్రాణము
రసా స్వాదనమే నాదమూమూ
భావ రాగ తాళ మధుర గానము
తీయ తేనియల రేకల
సోయగాల ధ్యానము

శిశు పశువులు శిరసునూపు
పరవశించు వినినంతనే
సంగీతపు సరసులోన
ఈతరాని రాజ హంస
శృతి లయలను గతి తప్పక
గమకిత స్తితి పాడు వాడు

పులకీంతల చక్కిలి తోని
గొంతు మార్చి వరుస కూర్చి
రక్తికైనా భక్తికై రమ్యమైన గానము
బాలుగారి గళములోన
జాలు వారు రస ఝరులు
యెన్ని పున్నమల సిరులో
తన పాటల గాన విరులు

నవరసాలు తలమునకల
జవరాలు మే రంగుల
హాస్యమైన వీరమైన
తన గొంతుల ప్రతిఫలించు
ఆ బాల గోపాలుని
లాలిత్యము మేళవించే

జాలి లేనీ కాలము
తన కర్కష కరములు సాచి
మృధు మురలిని  గాయపరచి
మది మది లోముదము నింపి
దివిజ వరుల యెద ఝల్లన
దివికేగిన అమృత రవళి
సురాంగనల పదభంగిమ
సరి సరి స్వర జతులగూర్చు

పాటల పల్లవులై మాటల మాంత్రికుడై
యెల్లలేవి లేనట్టి పల్లె పట్నమును జుట్టిన
నీ సరిగమలు మూగవోయే పదపదమనే పదనిసలు
రాగాల రోదన విను
తాలజతుల స్వర లయ గను
దివి కేగిన పారిజాత
స్వర మధురిమ ఇల విజేత
రావా?మల్లి రావా? పాటల పల్లవులు పంచ రావా?
 – జమ్మీ. (రాజమల్లయ్య), 9491319904

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply