Take a fresh look at your lifestyle.

మోడుబారిన బతుకులు..!

పుట్టు పూర్వో త్తరం తెల్వ నోళ్లు
కూడు గూడు.
గుడ్డకు నోచుకోనోళ్లు

లోకమంతా కాలి నడకన చుట్టేస్తూ …
బిక్షాటకులుగా బతుకు నెట్టుకొస్తున్నోళ్లు

కటిక దారిద్య్రం చుట్టుముట్టి …
కన్నీటి సంద్రంలో కొట్టుకుపోతునోళ్లు

జనావాసాలకు దూరంగా..
మురికి కూపాలకు చేరువుగా..
జంతువులవలె జీవనం సాగిస్తున్నోళ్లు

ఈ దేశంలో పుట్టినా..
ఏ ఆధా(ర్‌)‌రం లేనోళ్లు
ఏ ‘‘పౌరసత్వం’’ దక్కనోళ్లు
ఏళ్లకేళ్ళుగా ఇక్కడే ఉన్నా…
ఏ ‘‘హక్కులు’’ దక్కనోళ్లు
ఏ  జనాభా లెక్కల్లో ఎక్కనోళ్లు

ప్రభుత్వాలెన్ని మారినా…
ఏ ప్రగతి ఫలాలు అందనోళ్లు
ఏ నేతల దయకు నోచనోళ్లు

పథకాలు, ప్యాకేజీలంటూ …
కుళ్లు ‘‘సుద్దులు’’ దట్టించు ఏలికలారా..!
మీ స్వార్థ ప్రయోజనాల పక్కనెట్టి
ఈ సంచార జీవులను
కనీసం మనుషులుగా గుర్తిస్తే..
కాస్తంత ‘‘చేయూత’’ అందిస్తే…
జీవనోపాధి ‘‘మార్గం’’ చూపిస్తే …

ఎండబారిన ‘‘ఎద’’ ఎదల్లో …
ఒయాసిస్సులు తొణికిసలాడవా..!?

మోడుబారిన బతుకుల్లో..
నవ ‘‘వసంతాలు’’ వెల్లివిరియవా..!
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply