Take a fresh look at your lifestyle.

మోదీజీ…ఆనాటి మాటలు ఏమయ్యాయి

  • యూపిఎ హయాం నాటి ట్వీట్లను రీట్వీట్‌
  • ‌పెట్రో ధరలపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి కెటిఆర్‌

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 31 : దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పెట్రోల్‌ ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరలపై ట్వీట్లను ప్రధాని మోదీ గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 2014కు ముందు ప్రధాని మోదీ చేసిన ట్వీట్లను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ‌రీట్వీట్‌ ‌చేశారు. పెట్రో ధరల పెంపు విషయంలో యూపీఏ ప్రభుత్వాన్ని మోదీ ప్రశ్నించిన ట్వీట్‌ను కేటీఆర్‌ ‌రీట్వీట్‌ ‌చేశారు. యూపీఏ ప్రభుత్వం పెట్రోల్‌ ‌ధరలను భారీగా పెంచడంతో కోట్లాది మందిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాడు మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తాము అధికారంలోకి వొచ్చినప్పటి నుంచే పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు తగ్గిస్తామని మోదీ చేసిన మరో ట్వీట్‌ను కూడా కేటీఆర్‌ ‌రీట్వీట్‌ ‌చేశారు.

కేంద్ర వైఫల్యం వల్ల రాష్ట్రాలపై తీవ్ర భారం పడుతుందని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. పేదల అవసరాల పట్ల బాధ్యత లేకుండా బీజేపీ పాలిస్తుందన్నారు. బీజేపీ అధికారం కోసం అహంకారపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చామని బీజేపీ అబద్ధపు ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. మిషన్‌ ‌భగీరథ పథకానికి కేంద్రం వాటా ఎంత ఉందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. జీరో సహకారం అందించి ప్రచారం చేసుకోవడం ప్రధాని స్థాయికి తగదని కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply