Take a fresh look at your lifestyle.

మోదీ…ప్రజల చిరకా ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏం పద్దతి?

సిద్ధిపేట, ఫిబ్రవరి 9 (ప్రజాతంత్ర బ్యూరో): ట్విట్టర్‌ ‌వేదికగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మోదీపై తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు బుధవారం మంత్రి హరీష్‌రావు ట్విట్టర్‌ ‌వేదికగా పోస్టును చేస్తూ…బిజెపికి పూర్తి మెజారిటీ లేకపోయినా కాంగ్రెస్‌ ‌పార్టీతో పాటు అనేక ప్రతిపక్షాలు, బిజెపి మిత్ర పక్షాలు కూడా వ్యతిరేకించినప్పటికీ, ప్రతిపక్షాలు డివిజన్‌ ‌డివిజన్‌ అడిగినప్పటికీ, మూజువాణి వోటుతో వ్యవసాయ బిల్లులు పాస్‌ అయినట్లు రాజ్యసభలో ప్రకటించుకోవడం సక్రమమా?అని ప్రశ్నించారు. ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోడీ అని అడిగారు. పాలక, ప్రతిపక్షాలతో పాటు 33పార్టీలు సమర్ధించిన ఏపీ పునర్వ్యస్తీకరణ బిల్లు అక్రమమా? 4కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏం పద్దతి మోడీ అని నిలదీశారు.

రైతు వర్గమంతా తీవ్రంగా వ్యతిరేకించినా మీరు(బిజెపి) వ్యవసాయ బిల్లులు తేవడం న్యాయమా? ప్రాణాలకు తెగించి సిఎం కేసీఆర్‌ ‌చేసిన పోరాటం, వందలాది ఉద్యమకారుల ప్రాణత్యాగం ఫలితంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడం అన్యాయమా? ఇదెక్కడి న్యాం మోడీ అంటూ ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి హరీష్‌రావు ప్రశ్నలను సంధించారు. ఇప్పుడు ఈ ప్రశ్నలు సోషల్‌ ‌మీడియాలో తెగ వైరలయ్యాయి. అందరినీ ఆలోచింపచేస్తున్నాయి.

Leave a Reply