Take a fresh look at your lifestyle.

సంక్షోభాలను ఎదుర్కోవడంలో హనుమంతుడే స్ఫూర్తి

  • దేశ ప్రజలకు ప్రధాని మోడీ హనుమాన్‌ ‌జయంతి శుభాకాంక్షలు

మనుషులు ప్రతి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హనుమంతుడి జీవితమే స్ఫూర్తినిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. హనుమాన్‌ ‌జయంతి సందర్భంగా ప్రధాని తన ట్విట్టర్‌ ఎకౌంట్‌లో ఓ పోస్ట్ ‌చేశారు.  దేశ ప్రజలకు హనుమాన్‌ ‌జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నదని, దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ ‌విధించడంతో దేశ ఆర్థిక స్థితిగతులు తారుమారు అవుతున్నాయని ప్రధాని ట్వీట్‌ ‌చేశారు. భక్తిభావం, బలం, అకింతభావం, క్రమశిక్షణకు వాయుపుత్రుని జీవితం నిదర్శనమని, ప్రతి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆయన జీవితం స్ఫూర్తినిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

ప్రతి ఏడాది చైత్ర మాసంలో పౌర్ణమి రోజున హిందువులు హనుమాన్‌ ‌జయంతిని జరుపుకొంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆ పండుగను జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి. ఇదిలావుంటే ఏప్రిల్‌ 14 ‌తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కరోనాను పూర్తిగా కట్టడి చేసేందుకు అదొక్కటే మార్గమని తెలంగాణ సహా పలు రాష్టాల్రముఖ్యమంత్రులు, ఇతర నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం ఆ దిశగా సమాలోచ నలు చేస్తోందని తెలుస్తోంది. మరోవైపు, అన్ని విద్యాసంస్థల మూసివేతతో పాటు, ప్రార్థనా స్థలాలు, మత కార్యక్రమాలపై విధించిన ఆంక్షలు మే 15 వరకు కొనసాగాలని కేంద్ర మంత్రుల బృందం కూడా సిఫారసు చేసింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు ప్లోర్‌ ‌లీడర్లతో బుధవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ‌కూడా నిర్వహించారు.. కరోనా నియంత్రణ చర్యలపై చర్చించారు. లాక్‌డౌన్‌ ‌పొడిగింపుపై ఈనెల 11 లేదా 12వ తేదీన నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy