Take a fresh look at your lifestyle.

26‌న రాష్ట్రానికి ప్రధాని మోదీ

రామగుండం ఫర్టిలైజర్స్ ‌ప్రారంభం, ఐఎస్బీ రజతోత్సవ వేడుకలకు హాజరు

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఈనెల 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నట్లు సమాచారం. ఐఎస్బీ 50 ఏళ్ల వేడుకలతో పాటు రామగుండం ఫర్లిలైజర్స్ అం‌డ్‌ ‌కెమికల్స్ ‌లిమిటెడ్‌ ‌ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

రూ.6,160 కోట్ల వ్యయంతో నిర్మించిన 1.27 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ కర్మాగార నిర్మాణానికి 2017లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కర్మాగారం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈనెల 26న రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీ కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు.

Leave a Reply