Take a fresh look at your lifestyle.

మోదీ సోషల్‌ ‌మీడియా విష ప్రచారం .. !

కర్నాటక ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజలు ఏ పార్టీకి వోటేస్తారన్నది ..ఎవరిని గెలిపిస్తారన్నది 13న ఫలితాలతో తేలనుంది. ఇప్పుడక్కడ అధికారంలో ఉన్నది బిజెపి మాత్రమే. కానీ గత మూడేళ్లుగా అవినీతిలో కూరుకుని పోయిన బొమ్మై ప్రభుత్వం మరోమారు అధికారం కోసం గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ• ఛరిష్మా.. సోషల్‌ ‌డియా ప్రచారాలను ఉధృతం చేస్తోంది. దేశంలో మోదీ•ని అవతారపు రుషుడిగా కీర్తిస్తూ..గత పాలకులంతా పాపులుగా చిత్రీకరిస్తూ..బిజెపి సోషల్‌ ‌డియా కోడై కూస్తోంది. సోషల్‌ ‌డియాలో నిత్యం ప్రధాని నరేంద్ర మోదీ  గురించి గొప్పలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఆయన తుమ్మినా దగ్గినా అదో విజయంగా ప్రచారం సాగుతోంది. ఆయన అనేక విజయాలు సాధించినట్లు చెబుతున్నారు. మోదీ  వొచ్చిన తరవాత దేశం దశదిశ మారిందన్న ప్రచారం విపరీతంగా ఉంటోంది. అలాగే ఆయన మాత్రమే ఈ దేశాన్ని ఉద్దరించాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. భారత్‌ ‌కోసం పుట్టిన వరపుత్రుడని ప్రచారం చేస్తున్నారు. ఏ దేశం వెళ్లినా..ఏ దేశాధినేతతో మాట్లాడినా.. ఏదైనా శంకుస్థాపన చేసినా..ఏ ప్రారంభోత్సవం చేసినా ఆహా ఓహో అంటూ పుంఖానుపుఖాలుగా ప్రచారాలు వొస్తున్నాయి. కర్నాటకలో ఇది మరింత శృతి మించింది. నిజానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పులకుప్పగా మార్చేసింది. గడిచిన 9 ఏండ్లలో ఏటా సగటున రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఫలితంగా 68 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో తీసుకొన్న అప్పుల కన్నా 9 ఏండ్ల మోదీ పాలనలో తీసుకొన్న అప్పులే ఎక్కువయ్యాయి.  ఎడాపెడా అప్పులు చేసిన ఘనత నరేంద్ర మోదీదేనన్న విమర్శలు వ్యక్తమవు తున్నాయి. మరోవైపు పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌వంటగ్యాస్‌పై పన్నులు, సెస్సుల రూపంలో ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఎంతసేపు ఆదానీ అంబానీలకు దోచిపెట్టడం, వారిని మరింత సంపన్నులగా తీర్చిదిద్దే పనులు చేపట్టడం మినహా చేస్తున్న ఘనకార్యాలు ఏవీ లేవు.

దేశవ్యాప్తంగా బుల్లెట్‌ ‌ట్రైన్‌ ‌ప్రాజెక్టు సహా 18 మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.5 లక్షల కోట్ల అంచనా ఖర్చుతో పునాదిరాళ్లు తమ పేర్లతో వేసుకొన్నారు. వాటికి పెట్టుకొన్న గడువు కూడా తీరిపోయింది. ఒక్క తట్టెడు మట్టితీసిన పని కూడా జరగ లేదు. రూ.80 లక్షల కోట్ల అప్పుల సంగతి దేవుడెరుగు.. ఏటా రూ.3 లక్షల కోట్లు పెట్రో బాదుడుతోనే వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఏమయ్యాయంటే.. రాష్టాల్రు వ్యాట్‌ ‌తగ్గించాలని సుద్దు చెబుతారు. దారుణం గా అప్పులు చేస్తున్న తీరు ఒక వైపు అయితే…జిఎస్టీ పేరుతో వసూళ్లు చేస్తున్న పన్నులు మరోవైపు గుట్టలు గా పెరుగుతున్నా సామాన్యలకు ఉపశమనం కలిగించే పని ఒక్కటంటే ఒక్కటి కూడా చేయడం లేదు.ఇలా వొచ్చిన డబ్బును ఏం చేస్తున్నారని అడిగితే..గత ప్రభుత్వాలు చేసిన అప్పులను తీర్చేస్తున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో పుంఖానుపుంఖాలుగా ప్రాచరం చేస్తున్నారు. సోషల్‌ ‌డియా ప్రచారంలో బిజెపి నేతలు ఆరితేరారు. మోదీ ప్రభుత్వం చేసిన 80 లక్షల కోట్ల అప్పుతో చేసిన ఘనకార్యా లేంటో బీజేపీ నేతలు చెప్పగలరా అంటే సమాధానం రాదు. ఇంతకీ ఏం జరిగిందో ఎక్కడా చర్చ జరగదు. బ్రహ్మాండంగా దేశాన్ని నడిపిస్తే  దానినీ పార్లమెంటులో చర్చించరు.

రైతుల కోసం అంటూ ప్రవేశ పెట్టిన సాగు చట్టాలపై నా చర్చించరు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి రైతలను వంచించినా చర్చించరు. జిఎస్టీ పేరుతో పన్నలు బాదుడుపైనా చర్చించరు.  నిజానికి మోదీ అధికారంలోకి వొచ్చాక పార్లమెంటులో చర్చ అన్నది పక్కకు పోయింది. ఏ అంశమైనా సోషల్‌ ‌డియా ప్రచారం తప్ప చట్టసభల్లో చర్చించరు. లక్షన్నర కోట్లకు పైగా జిఎస్టీ వసూళ్లు అమోఘం అంటున్నారు. నిజానికి అంతగా ముక్కుపిండి వసూలు చేస్తున్న తీరుపై చర్చించరు. జిఎస్టీతో ప్రజలు ఏ విధంగా  పీల్చిపిప్పిచేయబడుతున్నారో చెప్పరు. చివరకు మనం పైసాపైసా కూడబెట్టుకుని చెమటోడ్చి సంపాదించిన డబ్బులతో హెల్త్ ఇన్సూరెన్స్, ‌జీవిత బీమా చేయించుకున్నా..జిఎస్టీ పేరుతో బాదేస్తున్నారు. దీనిపై చర్చించడం లేదు.  ఇకపోతే సామాన్యుల సొంతింటి కల నెరవే రడం లేదు. నిర్మాణరంగం కుదేల య్యింది. వ్యవసాయరంగం కుదేలయ్యింది. ఆర్థికరంగం అంతకుమించి కుదేలయ్యింది. అయినా అదీ చర్చించరు. ఉద్యోగ ఉపాధి రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిపైనా సోషల్‌ ‌డయాలో ప్రచారం జరగదు. ఎడాపెడా పెట్రో ధరలు పెంచుతూ పోతున్నా.. దాని వల్ల కలుగుతున్న విపరిణామాలను చర్చించరు. గ్యాస్‌ ‌ధరలు సామాన్యులకు భారంగా మారినా చర్చ చేయరు. అభూత కల్పనలను జోడించి చేస్తున్న చర్చల వల్ల బిజెపిని, మోదీ అతిగా చూపిస్తూ భారత్‌ ‌బ్రహ్మాండం అంటూ చూపుతున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదు.  తిండిపెట్టి, దేశయువతకు ఉద్యోగ,ఉపాధి కల్పించి, రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా వ్యవసా యాన్ని చేసే ఆలోచన ఏదీ మోదీ బృందానికి లేదు. ప్రస్తుతం పెంచిన పన్నులతో వొచ్చిన డబ్బును గత పాలకులు చేసిన అప్పులు తీర్చేందుకు వాడుతున్నా మంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నది. ఈ నకిలీ వార్తలను దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరేలా బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది.

ప్రధానిగా నరేంద్రమోదీ 2014లో అధికారంలోకి రాకముందు కేంద్రం చేసిన మొత్తం అప్పు రూ.55.87 లక్షల కోట్లు.  ఈ లెక్కన ప్రతి నెల మోదీ ప్రభుత్వం తీసుకొన్న సగటు రుణం రూ.83,341 కోట్లు. 2014లో కేంద్రానికి వొచ్చిన ఆదాయంలో పెట్రోల్‌, ‌డీజిల్‌పై వచ్చిన పన్నుల వాటా 5.4 శాతంగా ఉండగా, 2020-21 నాటికి అది 12.2 శాతానికి పెరింగింది. నేడు ఒక్క వంటగ్యాస్‌ ‌సిలిండర్‌కు పెడుతున్న ఖర్చుతో మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు రెండు సిలిండర్లు వొచ్చేవి. చమురు ధరల పెంపుతో కేంద్రం ఏటా రూ.3 లక్షల కోట్లను ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా..పట్టించుకోద్దన్న సూత్రాన్ని అవలంబిస్తున్నారు. ఎదురుదాడి చేస్తున్నారు. రాష్టాల్ల్రో అభివృద్ది అంతా తమ చలువేనని చాటుకుంటున్నారు. సిగ్గూఎగ్గూ లేకుండా ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. దీనికి చరమగీతం పాడకుంటే నష్టపోయేది ప్రజలే. ప్రజలు దీనిని నిరసించాలి. ఎక్కడిక్కడ నిలదీయాలి. సోషల్‌ ‌డియా విష ప్రచారాలను పసిగట్టాలి. ఎక్కడి కక్కడే ఎదురుదాడి ప్రారంభించాలి. తిప్పికొట్టాలి. అప్పుడే ప్రజలు విజయం సాధిస్తారు.
– ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply