బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటికి మోడీ పథకాలు
నాగర్ కర్నూల్,జూన్ 12.ప్రజాతంత్రవిలేకరి:భారత ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖను ప్రజలకు పంపిణీ కార్యక్రమంను శుక్రవారం బిజెపి ఆధ్వర్యం లో నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండ లంలోని దేవుని తిర్మలాపూర్ గ్రామంలో ప్రా రంబించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ దేశ ప్రధానమంత్రిగా రెండవసారి అధికారంలోకి రావడం ప్రధానమంత్రిగా 6సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ ఆరు సంవత్సరాలలో భారత దేశ ప్రతిష్ఠతను ప్రపంచ స్థాయిలో గర్వించే విధంగా వారు సాహసోపే త నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.
వారి నిర్ణయాల ఫలితంగా వారి పనితీరు వల్ల ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నా యన్నారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా దేశీయ వస్తువు లను ప్రోత్సహించడం వల్ల భారత దేశానికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది అందు చేత అందరం స్వదేశీ వస్తువులను ప్రోత్సహి స్తూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.స్వదేశీ వస్తువు ల ప్రోత్సహకం వల్ల దేశంలో చిన్న చిన్న స్వ దేశీ పరిశ్రమల వల్ల నిరుద్యోగ సంస్థలు కూడా పోయి యువతకు ఉద్యోగ అవకాశా లు లభిస్తాయని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజల అభ్యున్నతికి అనేక పథకాలు తీసుకు రావడం జరిగిందని అన్నారు. డిజిటల్ ఇండియా,మేకిన్ఇండియా,ఉజ్వల యోజన,గరీబ్ కళ్యాణ్ యోజన, కిసాన్ యోజన,లాంటి అనేక పథకాలు తీసు కురావడం జరిగిందని తెలిపారు.ఈ సంద ర్భంగా గ్రామంలో బిజెపి నాయకులు ఇంటిం టికి తిరిగి లేఖలను ప్రజలకు అందించారు. ఈ కార్యక్ర మంలో పెద్దకొత్తపల్లి మండల అద్యక్షులు పధిర భీమేష్, నాయకులు నాగరాజు, శంకర్, పరుశరామ్, సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.