Take a fresh look at your lifestyle.

అమరవీరులకు మోడీ నివాళులు….

యుద్ధస్మారకం వద్ద రెడు నిముషాలు మౌనం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్‌ ‌వార్‌ ‌మెమోరియల్‌ ‌వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. వార్‌ ‌మెమోరియల్‌ ‌వద్ద సందర్శకుల సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోదీ సంతకం చేశారు. ఆజాదీ కా అమృత్‌ ఉత్సవం సందర్భంగా ఈ ఏడాది కవాతు నిర్వహించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా సైనిక సామర్థ్యం, సాంస్కృతిక వైవిధ్యంతో ప్రదర్శనలు చేశారు. ఇండియా గేటు వద్ద ప్రధాని నరేంద్రమోదీ నేతాజీ డిజిటల్‌ ‌విగ్రహం తెరను ప్రారంభించి రిపబ్లిక్‌ ‌వేడుకలను ప్రారంభించారు. దేశంలో కోసం ప్రాణాలు అర్పించిన 25,942 మంది అమర సైనికుల పేర్లను వార్‌ ‌మెమోరియల్‌ ‌వద్ద గ్రానైట్‌ ‌పై చెక్కారు.

ఢిల్లీలోని నేషనల్‌ ‌వార్‌ ‌మెమోరియల్‌ ‌వద్దకు అమరవీరులకు నివాళులర్పించేందుకు బుధవారం జాతీయ యుద్ధ స్మారకం దగ్గరికి వొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త సంప్రదాయ డ్రెస్‌లో కనిపించారు. ఉత్తరాఖండ్‌ ‌ప్రత్యేక టోపీని ధరించి కనిపించారు. మెడలో మణిపూర్‌ ‌స్టోల్‌తో దర్శనమిచ్చారు. ప్రధాని మోడీ వస్త్రధారణకు సంబంధించి సోషల్‌ ‌వి•డియాలో చర్చనీయాంశంగా మారింది. చాలా మందికి ఈ టోపీ గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. సోషల్‌ ‌వి•డియాలో కొందరు రాజకీయ రంగు పులుముకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రధాని మోదీ ధరించిన టోపీ ఉత్తరాఖండ్‌ ‌హిల్‌ ‌క్యాప్‌. ఈ ‌టోపీ బ్రహ్మ కమలం అనే పుష్పానికి సంబంధించి చిహ్నంగా ఉంది. ఇది ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్ర పుష్పం. శుభ చిహ్నం. ఇది కాకుండా, దానిలో నాలుగు రంగుల స్ట్రి ‌తయారు చేయడం జరిగింది. ఇది జీవితం, ప్రకృతి, భూమి, ఆకాశం, సామరస్యాన్ని తెలియజేస్తుంది. ఈ టోపీని స్థానిక కళాకారులు ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ క్యాప్‌లో భూటియా రివర్స్ ‌క్లాత్‌ని ఉపయోగించినప్పటికీ, అది అందుబాటులో లేకుంటే ఉన్ని కోసం ట్వీడ్‌ ‌క్లాత్‌, ‌వెచ్చదనం కోసం ఖాదీ క్లాత్‌ని ఉపయోగించారు.

Leave a Reply