Take a fresh look at your lifestyle.

మోదీ చాలా ‘టఫ్‌’

Modi is very tough us president
అహ్మదాబాద్‌ ‌మొతెరా స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ‌మెలానియాతో ప్రధాని మోదీ కరచాలనం
  • కృషి, పట్టుదల ఉన్న నాయకుడు
  • ఆయన నేతృత్వంలో భారత్‌ ‌ప్రగతి అమోఘం
  • ప్రధానిని పొగడ్తలతో ఆకాశానికికెత్తిన
  • అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‘‌ట్రంప్‌’
  • ఇస్లామిక్‌ ‌టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడాలని  పిలుపు

అద్భుత విజేతగా భారత్‌ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ నిరంతరం కృషి చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ అన్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనడానికి మోదీయే నిదర్శనమని ఆయన అన్నారు. పారిశుద్ధ్యం, పేదరిక తగ్గుదలలో మోదీ అద్భుత విజయాలు సాధిస్తున్నారని చెప్పారు. మోదీని ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు కానీ, ఆయన మాత్రం చాలా టఫ్‌ (‌శక్తిమంతుడైన నాయకుడు) అని ట్రంప్‌ అన్నారు. భారత్‌ అద్భుతమైన అవకాశాలకు నెలవని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛనిచ్చి తన కలలను సాకారం చేసుకునే దిశగా భారత్‌ ‌తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందన్నారు. 70ఏళ్లలో భారత్‌ఎన్నో అద్భుతాలు సాధించిందన్నారు. రెండు రోజుల భారత పర్యటనకు కుటుంబ సమేతంగా వచ్చిన ట్రంప్‌.. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరిగిన ’నమస్తే ట్రంప్‌’ ‌కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ‘‌నమస్తే’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన నిజమైన మిత్రుడని, ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని ట్రంప్‌ అన్నారు. ఐదు నెలల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్‌ ‌స్టేడియంలో మోదీకి స్వాగతం పలికామని, ఇప్పుడేమో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ ‌మైదానంలో తనకు స్వాగతం పలికారని చెప్పారు. సాదర స్వాగతానికి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్రంప్‌ ‌తెలిపారు. ఈ ఆతిథ్యాన్ని తన కుటుంబం ఎప్పటికీ మరిచిపోదన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి రోడ్‌ ‌షోలను చూడలేదన్నారు. ఇదే సందర్భంలో ఇస్లామిక్‌ ‌టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. ఉగ్రవాదాన్ని నిలువరించేందుకు అమెరికా, భారత్‌ ‌కలిసికట్టుగా పనిచేయనున్నట్లు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌తెలిపారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్థాన్‌ను కట్టడి చేశామన్నారు. బోర్డర్‌లో ఆపరేట్‌ ‌చేస్తున్న మిలిటెంట్లను అదుపు చేయాలని పాక్‌ను హెచ్చరించినట్లు చెప్పారు. పాక్‌, ‌భారత్‌ ‌మధ్య ఉత్కంఠ పరిస్థితి తగ్గుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్‌ ‌తెలిపారు.

భారతదేశ చరిత్రలో గొప్పగొప్ప వ్యక్తులు ఉన్నారు. స్వా వివేకానంద బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని.. అంతరిక్ష పరిశోధన ల్లోనూ భారత్‌ ఎన్నో అద్భతాలను సృష్టించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజల హక్కుల రక్షణలో ఇరు దేశాలకు ఉన్న శ్రద్ధే భారత్‌, అమెరికాలను స్నేహితులుగా మార్చాయని ట్రంప్‌ ‌చెప్పారు.. అమెరికాకు గుజరాతీలు అందించిన సహకారం చాలా గొప్పదని తెలిపారు.. శక్తివంతమైన సైన్యం ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి అని తెలిపారు. బాలీవుడ్‌ ‌సినిమాలను ట్రంప్‌ ‌ప్రశంసించారు. దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే, షోలే తదితర సినిమాలను ప్రస్తావించారు. సంవత్సరానికి 2 వేల సినిమాలు నిర్మిస్తున్న దేశం భారత్‌ అన్నారు. సచిన్‌, ‌కోహ్లీ లాంటి అద్భుతమైన క్రికెట్‌ ఆటగాళ్ళున్న దేశం భారత్‌ అని, దీపావళి, హోలీ లాంటి పండుగలు సంస్క•తి సంప్రదాయాలను అద్దంపడతాయన్నారు. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్‌ ఎం‌టర్‌‌ప్రెన్యూర్‌షిప్‌ ‌సదస్సుకు ఇవాంకా హాజరైన విషయాన్ని ట్రంప్‌ ‌గుర్తుచేశారు. ఇండియా చేపట్టిన చంద్రయాన్‌ ‌ప్రోగ్రామ్‌ను ట్రంప్‌ ‌కీర్తించారు. అంతరిక్ష సహకారాన్ని అందించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని ట్రంప్‌ అన్నారు. పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. దేశ అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. పారిశ్రామికంగా ఉన్నతంగా ఎదుగుతున్నారు. గొప్ప ప్రగతిని సాధిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. పురుషులూ జాగ్రత్తగా ఉండాలి అంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దక్షిణాసియాలో భారత్‌ ‌కీలకపాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. భారత, అమెరికాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

3 బిలియన్‌ ‌డాలర్ల రక్షణ ఒప్పందాలు
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతే•రా వేదికగా సాగిన నమస్తే ట్రంప్‌ ‌కార్యక్రమంలో అగ్రదేశాధినేత డొనాల్డ్ ‌ట్రంప్‌ ఆద్యంతం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. దేశం కోసం మోదీ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రస్తుతించారు. భారత్‌- అమెరికాలు 3 బిలియన్‌ ‌డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని ప్రకటించారు. భారత్‌, అమెరికా ఎప్పటికీ నమ్మదగ్గ స్నేహితులు..లక్ష మందికి పైగా ఇక్కడికి రావడం ముదావహం. భారత్‌ ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరిచిపోలేం..ఈ పర్యటన మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిఉంటుంది. ఓ చాయ్‌ ‌వాలాస్థ్ధాయి నుంచి మోదీ ప్రధానిగా ఎదిగిన తీరు అద్భుతం..ఇంతటి విశాల దేశాన్ని మోదీ అద్భుతంగా నడిపిస్తున్నారు. అత్యంత విజయవంతమైన ప్రధానుల్లో మోదీ ఒకరు. భారతీయులు ఏదైనా సాధించగలరనేందుకు మోదీ నిదర్శనం అన్నారు. భారత్‌ ఆర్థిక ప్రబల శక్తిగా ఎదిగింది. దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్‌ ‌సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గాడ్‌ ‌బ్లెస్‌ ఇం‌డియా, గాడ్‌ ‌బ్లె•స్‌ ‌యూఎస్‌ఏ, ‌వీ లవ్‌ ‌యూ, ఇండియా అంటూ తన ప్రసంగాన్ని ట్రంప్‌ ‌ముగించారు.

Leave a Reply