Take a fresh look at your lifestyle.

న్యాయవ్యవస్థలోనూ మోడీ జోక్యం

  • రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాల కూల్చివేత
  • కేరళ ప్రచారంలో ప్రధానిపై మండిపడ్డ రాహుల్‌

‌కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం నియంతృత్వ వైఖరి అవలంబిస్తున్నదని కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళ రాష్ట్రం మలప్పురంలోని ఓ సభలో మాట్లాడిన ఆయన.. కేంద్ర సర్కారు న్యాయవ్యవస్థపై అజమాయిషీ చేస్తున్నదని, న్యాయవ్యవస్థను తనపని తాను చేసుకోకుండా అడ్డుపడుతున్నదని ఆయన మండిపడ్డారు. కేవలం న్యాయవ్యవస్థను అజమాయిషీ చేయడం మాత్రమే కాదని.. లోక్‌సభ, రాజ్యసభ లాంటి చట్టసభల్లో కూడా ప్రజా సమస్యలపై చర్చకు అనుమంతించడలేదని రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు.

అంతేగాక, పలు రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ తన సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నదని రాహుల్‌ ఆరోపించారు. రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాల కూల్చివేతకు కేంద్రంలోని బీజేపీ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నదని విమర్శించారు. బీజేపీ తీరుతో ఎన్నికల్లో విజయం సాధించడం అంటే నష్టపోవడం, తారుమారు అయిపోవడం అనేవి అర్థాలు మారాయని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు.

Leave a Reply