Take a fresh look at your lifestyle.

ఏం చేద్దాం..?

  • ముఖ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి

భారతదేశం దాదాపు 7,500 కరోనావైరస్ కేసులతో కరోనతో పోరాడుతున్న సమయంలో, ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తదుపరి చర్యల గురించి చర్చించారు. 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత ఏం చేద్దాం..? అని అడిగారు. ప్రస్తుత లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుంది. పిఎం మోడీ, ఇతర మంత్రులు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వీడియో కాన్ఫరెన్స్ సమయంలో ఇంట్లో తయారుచేసిన మాస్కలు ధరించి కనిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగించడానికి అనుకూలంగా ఉన్నామని ప్రధానికి తెలిపారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో లాక్డౌన్ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని సూచించినట్లు తెలిసింది. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా ఇదే విధంగా కోరారు. ఛత్తీస్ఘర్ ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ ఇంటర్ స్టేట్ రోడ్డు రైలు, వాయు సౌకర్యాలపై నిషేధం అలాగే కొనసాగించాలని అన్నారు, అయితే రాష్ట్రాల సరిహద్దుల మార్గాలను తెరిచి ఆర్థిక కార్యకలాపాలకు అనుమతించాలని ప్రధానిని కోరారు. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్ జార్ఖండ్‌లు మంగళవారం తర్వాత తమ రాష్ట్రాలలో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయబోమని సూచించాయి. అమరీందర్ సింగ్ (పంజాబ్), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర), యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర ప్రదేశ్), మనోహర్ లాల్ (హర్యానా), కె చంద్రశేఖర్ రావు (తెలంగాణ), నితీష్ కుమార్ (బిహార్) వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

గత వారం, ప్రధానమంత్రి తన ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత “ప్రతి ప్రాణాన్ని కాపాడటం కనుక లాక్డౌన్ ఒకేసారి” ఎత్తివేసే అవకాశం లేదని చెప్పారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నిపుణులతో చర్చలు జరిపిన తరువాత ప్రధాని తుది నిర్ణయం తీసుకుంటారు. అనక పీఎం తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్రలు అనుసరిస్తాయి అనుకుంటున్నాము, అని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వర్గాలు అంటున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!