Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఏర్పాటును మోదీ పదేపదే అవమానిస్తున్నారు

తెలంగాణను అవమానించేలా ప్రధాని మోడీ వ్యాఖ్యలు : మండిపడ్డ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ
ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 9 :  ప్రధాని వ్యాఖ్యలపై టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ఏర్పాటును మోదీ పదేపదే అవమానిస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు పట్ల మోదీ వ్యతిరేకభావంతో ఉన్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. మోదీ వ్యాఖ్యలతో సుష్మాస్వరాజ్‌ ఆత్మ ఘోషిస్తుందన్నారు. అంబేద్కర్‌ ‌సూచనల మేరకే తెలంగాణ ఏర్పాటైందన్నారు. ప్రధానికి చితశుద్ధి ఉంటే..కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించి న్యాయం చేయాలన్నారు.

తెలంగాణపై ఆధిపత్యం కోసం ప్రధాని ప్రయత్నిస్తున్నారన్నారు. విభజన హావి•లను ఎందుకు అమలు చేయడం లేదని కోదండరాం ప్రశ్నించారు. కాంగ్రెస్‌, ‌బిజెపిల మద్దతుతోనే తెలంగాణ ఏర్పడిందన్న విషయం మరువ రాదన్నారు.

తెలంగాణను అవమానించేలా ప్రధాని మోడీ వ్యాఖ్యలు : మండిపడ్డ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ ‌మాట్లాడుతూ..ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. అందరి పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కానీ మోదీ తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడటం బాధాకరమన్నారు. బీజేపీ అధికారంలోకి వొచ్చి ఎనిమిదేండ్లు అవుతున్నప్పటికీ ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను ఇవ్వడం లేదు. తెలంగాణ ఉద్యోగుల విషయంలో మోదీ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.

బీజేపీ హాయాంలో ఏర్పడ్డ రాష్ట్రాల్లో ఏం సమస్యలు లేవా? అని ప్రశ్నించారు. ఆ రాష్ట్రాల్లో కూడా విభజన సమస్యలు ఇంకా ఉన్నాయని గుర్తు చేశారు. ఏపీ పునర్‌ ‌వ్యవస్థీకరణ చట్టంలోని సమస్యలను కేంద్రం పరిష్కరించడం లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. విభజన సమస్యలు అనేకం ఉన్నాయన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో మరో ఉద్యమం వొచ్చే అవకాశం ఉందన్నారు. మోదీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఎన్జీవో అధ్యక్షుడు డిమాండ్‌ ‌చేశారు. రేపట్నుంచి అన్ని జిల్లాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఆయన తెలిపారు.

Leave a Reply