Take a fresh look at your lifestyle.

బండి సంజయ్‌కి మోదీ ఫోన్‌

‌తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆరా
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి శనివారం ఫోన్‌ ‌చేసి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. జీఓ 317కు వ్యతిరేకంగా జాగరణ దీక్ష సందర్భంగా పోలీసులు సంజయ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపగా హైకోర్టు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీక్ష తదనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను మోడీకి సంజయ్‌ ‌వివరించారు. పోలీసులు వ్యక్తిగతంగా సంజయ్‌పై దాడి చేయడానికి కారణం ఏమిటనీ, ఎంపీ కార్యాలయంలోకి వొచ్చి ఎలా అరెస్టు చేస్తారని అన్నట్లు సమాచారం.

దుబ్బాక, జీహెచ్‌ఎం‌సి, హుజూరాబాద్‌ ఎన్నికలలో బీజేపీ విజయాలను మోదీ ప్రస్తావించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా సంజయ్‌ ‌చేస్తున్న పోరాటాని మోదీ ప్రశంసించారు. సంజయ్‌ ‌కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వ విధానాలపై పోరాటం కొనసాగించాలనీ, మీకు అన్ని విధాలా అందుబాటులో ఉంటామని ఈ సందర్బంగా ప్రధాని మోదీ బండి సంయ్‌కు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Leave a Reply