Take a fresh look at your lifestyle.

కొత్తదనం లేని మోడీ బడ్జెట్‌!

“ప్ర‌ధాని  నరేంద్ర మోడీ  2020-21 బడ్జెట్‌  ‌చాలా సాదాసీదాగా ఉంది వివిధ శాఖల పద్దుల వార్షిక గణాంకాలను సభకు సమర్పించినట్టుగా  ఉంది.  ఆయన సంవత్సరం పొడవునా   ఆర్థిక రంగానికి సంబంధించి  ప్రకటనలు చేస్తారు.ఆయన  విధానాలకు అది అతికినట్టు ఉంటుంది.”

మోడీ  తొలిసారి  అంటే  2014లో అధికారంలోకి రాగానే     రైల్వే బడ్జెట్‌ ‌ను రద్దు చేశారు. ఇందుకు కొందరు రాజకీయ వేత్తలు ముఖ్యంగా,  బీహార్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌లకు చెందిన మాజీ రైల్వే మంత్రులు  మోడీని  తప్పు పట్టారు.  అప్పట్లో రైల్వే మంత్రిత్వ శాఖకు పోటీ ఉండేది.ఇప్పుడు ఎవరూ    గొడవ పడనవసరం లేదు.  మరో తరం మారితే దేశంలో  రైల్వేలకు  ప్రత్యేక బడ్జెట్‌ ఉం‌దనే విషయం జనానికి తెలియదు.    రైల్వే బడ్జెట్‌ ‌ను సాధారణ బడ్జెట్‌ ‌లో విలీనం చేయడం వల్ల  కొత్త రైళ్ళ గురించి టికెట్‌ ‌ధరల పెంపు గురించి సమాచారం ఏదీ ఈ కొత్‌ ‌బడ్జెట్‌ ‌లో లేదు.   మీడియాకు ఇది పెద్ద  వార్తలా కనిపించలేదు.      సాధరణ బడ్జెట్‌ ‌ను కూడా ఇలా చేయాలనేది మోడీ సిద్ధాంతమేమో.,   కొత్త బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టి న తర్వాత మార్కెట్లు  పడిపోయాయి.   బడ్జెట్‌ ‌కు ముందు పెట్టుకొన్న ఆశలన్నీ ఆవిరి అయ్యాయి.  మోడీ ఆరో బడ్జెట్‌ ‌లో  కొత్తదనం ఏమీ లేదు. సాదాసీదాగా ఎప్పటి మాదిరిగానే ఉంది.  బడ్జెట్‌ ‌లో  సంపన్నులను నొప్పించలేదు.,   సామాన్యులను ఆనంద పర్చే అంశాలేవీ లేవు,.  పెద్ద నోట్ల రద్దు,    పన్ను ఎగవేత దారులకు  క్షమాభిక్ష పథకాలు.,  వంటివి ఏమీ లేవు.    2019లో ఏ  విధంగా అయితే     ఆర్థిక రంగాన్ని కుప్పకూల్చిందో ఇప్పుడూ అలానే ఉంది.  మార్కెట్లు   పడిపోయాయి.     విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు   కనిపించలేదు,  మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్‌ ‌పన్ను తగ్గింపు పెద్ద సంస్కరణ. దానిపై చర్చ లేకుండానే పన్ను తగ్గింపును ప్రకటించారు. పాలనా పరమైన నిర్ణయం మాదిరిగా ప్రకటించారు.

 

ఈ బడ్జెట్‌ ‌మార్కెట్లను దెబ్బతీశాయి.  బడ్జెట్‌ ‌లో  ఆశ్చర్యాలు ఏమీ లేవు. పెట్టుబడుల ఉపసంహరణకు ఊతం లేదు. మోడీ మనసులో ఏదైనా   తడితే ఏదో ఒక రోజు సాయంత్రమో, రాత్రో  పెద్ద నోట్ల రద్దు  ప్రకటన చేసినట్టు    ఒక ప్రకటన చేస్తారు.  అసలు ప్రభుత్వానికి  బడ్జెట్‌ అవసరం లేదన్నది ఆయన సిద్దాంతంగా కనిపిస్తోంది. ముఖ్యమైన ప్రకటనలు చేయడానికి ప్రధాని ఎంచుకునే వారాలు, బుధవారం, శుక్రవారం,.  పెద్ద బడ్జెట్‌  ఎప్పుడూ   సమస్యాత్మకమైనవే, పేదలకు వరాలు ప్రకటిస్తే మార్కెట్లు   ఆగ్రహం వ్యక్తం చేస్తాయి.గత ఏడాది  బడ్జెట్‌ ఇం‌దుకు ఉదాహరణ.  కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ    మోడీ   ప్రభుత్వాన్ని  సూటు,బూటుకి సర్కార్‌ అని అభివర్ణించారు.  రక్షణ మంత్రిత్వ శాఖ నిధుల కోసం  అభ్యర్ధిస్తూ  ఆర్థిక సంఘానికి లేఖ   రాసింది.   అందుకు సమాధానంగా  డిఫెన్స్ ‌సెస్‌ ‌విధించాలని ఆర్థిక సంఘం సూచించింది.  ప్రైవేటీకరణ గురించి బడ్జెట్లో  పేర్కొన్నారు. జీవిత భీమా సంస్థను  ప్రైవేటుకు అప్పగించే ఆలోచనలు చేస్తున్నారు.  ఎయిర్‌ ఇం‌డియా,   ఐపీఓ, బీపీసీఎల్‌ , ‌మొదలైన సంస్థలన్నింటినీ  ప్రైవేటుకు అప్పగించే ఆలోచనలో ఉన్నారు.  ఇప్పుడు ఎల్‌ ఐసీ  పేరు బయటపెట్టారు.     సంఘ్‌ ‌పరివార్‌ ‌నాయకులు దీనిపై ఆందోళన చేస్తే ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు. నరేంద్రమోడీ  ప్రధానంగా రాజకీయ వేత్త.  ఈ విషయంలో పూర్వపు ప్రధాని ఇందిరాగాంధీ కన్నా కూడా,  ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఓటర్లపై ప్రభావం ఉండేదిగా ఉండాలని కోరుకుంటారు.   అవసరాన్ని బట్టి ఆయన    వడ్డింపులు, వరాలు ప్రకటిస్తూ ఉంటారు.  ఈ బడ్జెట్‌ ‌విషయంలోనూ అంతే జరగవచ్చు.
శేఖర్‌ ‌గుప్త,
‘ద ప్రింట్‌’ ‌సౌన్యంతో..

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!