Take a fresh look at your lifestyle.

మోడీ ‘బౌన్సర్లు ..’!

దేశ ప్రధాని నరేంద్ర  మోడీ నేతృత్వంలోని  ప్రభుత్వం ఆరేళ్ళు నిరంతరాయంగా నడిచిన..నడుస్తున్న  నేపథ్యంలో కేంద్ర  ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ఆరు మాస్టర్‌ ‌స్ట్రోక్స్ ‌ని పరిశీలిద్దాం..

మొదటి మాస్టర్‌ ‌స్ట్రోక్‌ ‌డిమానిటైజేషన్‌:
18 ‌నవంబర్‌ 2016‌లో మోడీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది. డిమానిటైజేషన్‌ ‌కి ప్రభుత్వం చెప్పిన ప్రధాన కారణం బ్లాక్‌ ‌మనీ కి చెక్‌ ‌పెడతాం సంఘ వ్యతిరేకుల  దగ్గర ఉన్న  డబ్బు మొత్తం జీరో  చేస్తాం.. దీనితోపాటు ఆవినీతి కి.. నకిలీ నోట్లకి చెక్‌ ‌పెడతాం..

జరిగింది ఏమిటి: రిజర్వ్ ‌బ్యాంకు రిపోర్ట్ ‌ప్రకారం 99.3 శాతం కరెన్సీ ఆర్థిక వ్యవస్థలోకి వెనక్కి వచ్చింది అంటే బ్లాక్‌ ‌మనీ అంతరించిపోకుండా.. బ్లాక్‌ ‌మనీని వైట్‌ ‌మనీగా రూపాంతరం చెందింది. డిమానిటైజేషన్‌ ‌వలన అన్‌ ఆర్గనైజ్డ్  ‌సెక్టార్‌ ‌తీవ్రంగా దెబ్బతింది. దీనివలన ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగిలింది లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.

రెండవ మాస్టర్‌ ‌స్ట్రోక్‌ ‌గూడ్స్ అం‌డ్‌ ‌సర్వీసెస్‌ ‌టెక్సషన్‌:
‌మోడీ ప్రభుత్వం గూడ్స్ అం‌డ్‌ ‌సర్వీసెస్‌ ‌టాక్స్  ‌తీసుకువస్తూ చెప్పిన మాట ఒక దేశం ఒకే టాక్సషన్‌. ‌దీనివలన టాక్స్ ‌పే చెయ్యటం సులభమవుతుంది. వినిమయ వస్తువుల ధరలు తగ్గుతాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది.  అని మోడీ ప్రభుత్వం చెప్పింది జరిగినది ఏమిటి: వరల్డ్ ‌బ్యాంక్‌ ‌చెప్పిన దాని ప్రకారం భారతదేశంలో జిఎస్టి వచ్చిన తర్వాత టాక్సషన్‌ ‌విధానం అత్యంత క్లిష్టం అయిపోయింది gstఅనే  విధానంతో భారత్‌ అత్యధిక పన్నులు ప్రజల నుంచి వసూలు చేస్తున్నది. ఐఎంఎఫ్‌ ‌చీఫ్‌ gstవలన భారత ఆర్థిక వ్యవస్థ వెనకంజ వేస్తుంది అని కూడా చెప్పారు. నేడు gst వలన రాష్ట్రాలు ఆదాయం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా బీజేపీ పాలిత రాష్ట్రం  మాకు రావలిసిన gst నిధులు ఇవ్వమని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నది.

మూడవ మాస్టర్‌ ‌స్ట్రోక్‌ ఉద్యోగాల కల్పన:
2013లో ఆగ్ర ర్యాలీలో భారతదేశంలో అత్యధిక యువత ఉన్న నేపథ్యంలో  ఒక కోటి ఉద్యోగాలు మేం అధికారంలోకి వస్తే ఇస్తాము అని మోడీ చెప్పారు. జరిగింది ఏమిటి : NSSO డేటా ప్రకారం 2012 నుంచి 2018 వరకు మూడుకోట్ల సాధారణ శ్రామికులు ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం లాక్డౌన్‌ ‌సమయంలో 67% వర్కర్స్ ‌తన ఉద్యోగం   కోల్పోయారు అని అజీం ప్రేమ్‌ ‌జీ యూనివర్సిటీ సర్వే  చెప్పింది. లేబర్‌ ‌మినిస్ట్రీ ఇచ్చిన నివేదిక ప్రకారం 2017-18 మధ్య గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉద్యోగాలు పోయాయి. మన దేశంలో 60 శాతం గ్రాడ్యుయేట్‌ ‌యువత నిరుద్యోగంతో ఉన్నది. చదువుకున్నవారిలో 60%శాతం ఉద్యోగాలు లేవు అంటే చదువు లేని వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. దీనికి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాధానం పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే..

నాల్గవ మాస్టర్‌ ‌స్ట్రోక్‌ 2020 ‌సరికి రైతులకు రెండింతలు ఆదాయం:
రైతన్నకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్ననేపథ్యంలో రైతులకు రెండింతల ఆదాయం అని మోడీ ప్రభుత్వం చెప్పింది. జరిగింది ఏమిటి:గణాంకాలను  దాచే మోడీ ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం 2016లో 11,379  రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. NCRB డేటా ప్రకారం 10349 రైతులు 2018లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భారత దేశములో 65%పైగా మహిళలు వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం రైతు సంఘాలు ఇంకా గుర్తించనే లేదు. వీరికి సంబంధించి డేటా వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా తేలుతుంది.

ఐదవ మాస్టర్‌ ‌స్ట్రోక్‌ ‌నమామి గంగే పధకం :
గంగ శుద్ధి ప్రాజెక్టు కోసం మోడీ ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ ఐదు సంవత్సరాల కోసం కేటాయించింది. (కరోనా సమయంలోనే  కొత్త పార్లమెంట్‌ ‌భవనం కట్టడానికి కొత్త రాజ్‌ ‌పాత్‌  ‌నిర్మించడానికి  కూడా 20 వేల కోట్ల రూపాయలే మోడీ ప్రభుత్వం ప్రకటించింది.)

జరిగింది ఏమిటి: 2019 సరికి 70-80% గంగా నది శుభ్రం అవుతుంది అని చెప్పి మోడీ ప్రభుత్వం పని మొదలు పెట్టింది. ఇప్పటికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయాయి. అయినా కానీ గంగ శుభ్ర పడలేదు.  పైగా మరింత మలినం అయ్యింది. అయితే లాక్‌డౌన్‌ ‌సమయంలో స్వయంగా గంగ నది చెప్పింది తను ఎలా శుద్ధి కాగలనో. గంగను క్లీన్‌ ‌చేయాలి అంటే నదుల ఒడ్డున పరిశ్రమలపైనా యాక్షన్‌ ‌తీసుకోవాలి..! తరాలుగా ఏ ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవడం లేదు మోడీ ప్రభుత్వం కూడా ఇందుకు మినహాయింపు కాదు.

ఆరవ మాస్టర్‌ ‌స్ట్రోక్‌ 20 ‌లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్‌:
ఈ ‌ప్యాకేజీ ద్వారా భారత ఆర్ధిక వ్యవస్థను నిలబెడతాం.. అట్టడుగు మనిషికి అండగా ఉంటాం అని మోడీ ప్రభుత్వం ఆర్భటంగా 2020లో 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించింది.

జరిగింది ఏమిటి: ప్రధానమంత్రి ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటన ద్వారా చిన్నా గిమ్మిక్‌ ‌చేసారు. గతంలో పాత వీధులు ,నగరాల పేర్లు మార్చేసినట్టు.. ఈసారి మేక్‌ ఇన్‌ ఇం‌డియా అన్న పాపులర్‌ ‌మాటని ‘‘లోకల్‌ ‌పై ఓకల్‌’’ అని ‘‘ఆత్మ నిర్భర్‌’’ అని పేరు మార్చేశారు. ఇక విషయానికి వస్తే మోడీ ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజిలో ఎనిమిది లక్షల కోట్లు ఆర్బిఐ లిక్విడిటీ వుంది.. అంటే బ్యాంకులు బడా బాబులకు అప్పు ఇస్తే వాళ్ళు అప్పు తీర్చ కపోతే ఆ అప్పు రిజర్వ్ ‌బ్యాంకు తీరుస్తుంది అనే హామీనే ఆర్బిఐ లిక్విడిటీ. అంటే 20 లక్షల కోట్ల ప్యాకేజిలో నేరుగా 8 లక్షల కోట్ల రూపాయలు బడా బాబుల కోసం..! ప్రపంచంలోని మిగతా దేశాలలో ఇలా ప్యాకేజీలు ప్రకటించేటప్పుడు.. తమ దేశాల్లో ఉన్న సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి అని చెప్పి బడాబాబులకు అందించే చేయూత ఇలా ప్యాకేజీలో కలిపి చెప్పవు. పీఎం మోడీ భారత ప్రజలకి ఆర్ధిక అంశాలు ఎప్పటికి అర్ధం కావాలిలే అనుకుని ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పధకం ప్యాకేజీలో బడా బాబులకు చేసే ఆర్థిక సహాయం కూడా కలిపేసి ప్రకటించారు. ఆర్థిక లోటును పూడ్చేందుకు అని చెప్పే రిజర్వ్ ‌బ్యాంకు లిక్విడిటీ బడా బాబులకు చేసే సహాయం అని అర్ధం అయితే ఈ ప్యాకేజి డొల్లతనం అర్ధం అవుతుంది. ప్రయివేటు వ్యక్తులకి ఇంత పెద్ద మొత్తం ఇస్తూ ‘‘ఆత్మ నిర్బర్‌’’  ‘‌లోకల్‌ ‌పై వోకల్‌’’ అం‌టే ఏమి లాభం..? ఇక 20 లక్షల కోట్లలో ఎనిమిది లక్షల కోట్లు తీసేస్తే మిగిలింది 12 లక్షల కోట్లు .. దీనిలో 1.7 లక్షల కోట్లు అదివరకే ప్రకటించిన ప్యాకేజీ. ఇలా మొత్తం ప్యాకేజీలో గతంలో ప్రకటించిన ప్యాకేజీలు అన్నీ తీసుకుంటూ పొతే ప్రజల కోసం చేసే సంక్షేమ పధకాల కోసం కొత్తగా మిగిలింది కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే. మోడీ ప్రభుత్వం డాబుగా చెప్పుకునే ఈ ఆరు మాస్టర్‌ ‌స్ట్రోక్‌ ‌ల లోగుట్టు ఇలా వుంది.. వీటిపై బీజేపీ 750 వర్చువల్‌ ‌ర్యాలీస్‌ ‌చేసి ప్రజలకి తమ మాస్టర్‌ ‌స్ట్రోక్స్ ‌గొప్పలు చెప్పనున్నది.

Leave a Reply