Take a fresh look at your lifestyle.

అటు మోడీ.. ఇటు కెసిఆర్‌..

  • ‌వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు
  • టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రాష్ట్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది.. సిఎల్‌పి నేత భట్టి ఫైర్‌
ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ అన్నారు..నిరుద్యోగ సమస్య ఉండదు అన్నారు..మరి ఎందుకు ఇప్పుడిలా ఉన్నారంటూ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారో తెలియదని, అప్పులు తీర్చడానికి కూడా అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వొచ్చిందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితి చూస్తే ఎప్పుడు గట్టెక్కగలమో అన్న ఆందోళన కలుగుతోందన్నారు. అప్పులతో ప్రజలను ఎంతోకాలం మభ్యపెట్టలేరని అన్నారు.
 రైతులకు వ్యతిరేకంగా బిల్లులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, నియంత్రణ పంటలతో రైతులకు అన్యాయం చేస్తున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  అన్నారు. రైతులను మోసం చేస్తున్న కేసీఆర్‌, ‌మోదీ ఖబర్దార్‌ అని ఈ సందర్భంగా భట్టి నిప్పులు చెరిగారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నష్టాలపాలు చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని అటు మోదీ, ఇటు కేసీఆర్‌ ‌నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆయన కొడుకు, అల్లుడు కోసం మాత్రమే పని చేస్తున్నారని మండిపడ్డారు. నియంత్రణ పంటలతో రైతుల నోట్లో మట్టి గొట్టారని అన్నారు. సన్నాలు వేయాలని చెప్పిన ముఖ్యమంత్రి..ఇప్పుడు మాత్రం వాటికి మద్ధతు ధర ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల విషయంలో టిఆర్‌ఎస్‌ ‌దొంగాట : షబ్బీర్‌ అలీ
రైతుల విషయంలో టీఆర్‌ఎస్‌ ‌దొంగనాటకాలు ఆడుతోందని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ‌నేత షబ్బీర్‌అలీ మండిపడ్డారు.  టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ వోట్ల కోసం నోట్ల కట్టలు వెదజల్లారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో గెలిచిన నేతలను కోట్లు ఇచ్చి సీఎం కేసీఆర్‌ ‌కొన్నారని విమర్శించారు. లిక్కర్‌ ఏరులై పారిందని, అందుకే కాంగ్రెస్‌ ‌గెలవలేకపోయిందని ఆయన చెప్పారు. తమ పార్టీ గొంతు నొక్కి మాట్లాడే అవకాశం లేకుండా చేశారని షబ్బీర్‌ అలీ ధ్వజమెత్తారు.

Leave a Reply