Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఏర్పాటుపై మోడీ అక్కసు

  • రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే వ్యాఖ్యలు
  • పార్లమెంట్‌ ‌పద్దతులు కూడా తెలియన ప్రధాని
  • పూర్తి శాస్త్రీయంగా తెలంగాణ బిల్లు పాసయింది
  • పార్లమెంటులో ఇప్పుడే అశాస్త్రీయ విధానాలు సాగుతున్నాయి
  • ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘనకు ఆలోచిస్తాం
  • రాజ్యసభలో మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డ టిఆర్‌ఎస్‌ ఎం‌పిలు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభ వేదికగా చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ అభ్యంతరకమని టిఆర్‌ఎస్‌ ‌పార్లమెంటరీ పార్టీ విమర్శించింది. తెలంగౄణకు వీసమెత్తు సాయం కూడా చేకుండా తెలంగాణ ఏర్పాటుపై అక్కసు తీర్చుకునే తీరు దుర్మార్గమని పార్లమెంటరీ పార్టీనేత కె. కేశవరావు అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు మాలోతు కవిత, రంజిత్‌రెడ్డి, నామా నాగేశ్వరరావుతో కలిసి ఆయన న్యూ దిల్లీలో వి•డియాతో మాట్లాడారు. తెలంగాణపై మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి చిన్నచూపు ఉందని చెప్పడానికి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ‌పార్లమెంటు సభ్యులు నిరసన గళం వినిపించారు. తెలంగాణ భవన్‌లోని గురజాడ హాల్‌లో టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు వి•డియాతో మాట్లాడుతూ మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ని, పార్లమెంట్‌ ‌విధులను మంటగలిపే విధంగా ప్రధాని మోడీ మాట్లాడటం శోచనీయమని టీఆర్‌ఎస్‌ ఎం‌పీ, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అన్నారు.

తెలంగాణ ప్రజల్ని అవమానించేలా మోడీ వ్యాఖ్యానించారని కేకే మండిపడ్డారు. విభజన అన్‌సైంటిఫిక్‌గా జరిగిందని మోడీ ఏడేళ్ల తర్వాత అంటున్నారని అంటే ఎంతగా అక్కసుతో ఉన్నరో అర్థం అవుతుందని అన్నారు. పార్లమెంట్‌ ‌పద్ధతుల గురించి తెలిసినవారు ఎవరూ కూడా ఇలా మాట్లాడరని అన్నారు. పార్లమెంట్లో జరిగే దేనినీ కోర్టు కూడా ప్రశ్నించడానికి వీలుండదన్నారు. పార్లమెంట్‌లో శాస్త్రీయం, ఆశాస్త్రీయం అంటూ ఏవి• ఉండదన్నారు. మెజారిటీ ఉందా లేదా అనేది చూసి బిల్లు పాసు చేస్తుంటారని కేకే స్పష్టం చేశారు. సభలో గలాటా జరిగితే, అప్పుడు ఏం చేయాలన్న విషయంపై కూడా రూల్‌ ‌బుక్‌ ఉం‌దన్నారు. తెలంగాణ బిల్లు సమయంలో బీజేపీ కూడా మద్ధతు తెలిపిందని గుర్తు చేసిన కేకే.. ఆ విషయం మరచిపోవద్దన్నారు. బిల్లు సమయంలో ఆంధ్రా ఎంపీలు నిజంగానే బాగా గొడవ చేశారు. అయితే, రూల్‌ ‌బుక్‌ ‌నిబంధనల మేరకే సభాపతి వ్యవహరించారని అన్నారు.

రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన తర్వాత ఆశాస్త్రీయం అంటే అర్థం ఏంటి? పెప్పర్‌ ‌స్పే చల్లడం వంటివి జరిగాయి కాబట్టే సభాపతి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మెజారిటీ విషయంలో ఎవరైనా స్పీకర్‌ ‌నిర్ణయాన్ని సవాల్‌ ‌చేస్తే, లాబీ క్లియర్‌ ‌చేసి..వోటింగ్‌ ‌నిర్వహిస్తారన్నారు. కౌంటింగ్‌ ‌నిర్వహించడం సాధ్యపడని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలన్నది కూడా రూల్‌ ‌బుక్‌లో ఉందన్నారు. పూర్తి శాస్త్రీయంగా తెలంగాణ బిల్లు పాసయింది. నిజానికి ఇప్పుడు బిల్లులను పాస్‌ ‌చేస్తున్న తీరు ఆశాస్త్రీయంగా ఉందన్నారు. ప్రస్తావన, నోటీస్‌, ‌చర్చ ఏదీ లేకుండా బుల్‌ ‌డోజ్‌ ‌చేస్తూ బిల్లులు పాసు చేస్తున్నారని కేకే విమర్శించారు. పార్లమెంటును, సభాపతులను కించపరిచే విధంగా ప్రధాని మాట్లాడుతున్నారు. ఝార్ఖండ్‌ ‌బిల్‌ ‌సమయంలో కూడా కొందరు వాజపేయి వి•దకి దూసుకెళ్లిన విషయం మర్చిపోవద్దని కేకే అన్నారు. అడ్డుకునే ప్రయత్నంలో ఆనంద్‌ ‌మోహన్‌ అనే సభ్యుడి చేయి విరిగిందన్నారు. పెప్పర్‌ ‌స్ప్రే ఘటన మినహా తెలంగాణ బిల్లు పక్రియ సాఫీగా జరిగిందన్న కేకే..పార్లమెంట్‌ ‌పద్ధతులు తెలియకుండానే ఒక ప్రధాని ఇలా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు సభాహక్కుల ఉల్లంఘన కిందకు వొస్తాయా.. లేదా.. అన్న అంశంపై న్యాయ సలహా తీసుకుంటామని కేకే అన్నారు.

లోక్‌సభ టీఆర్‌ఎస్‌ ‌పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ..రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ చరిత్ర తెలవకపోవడం వల్ల మాట్లాడుతున్నాడో.. ఏందో అర్ధం కావడం లేదన్న నామా.. ప్రధాని మోడీ వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు. 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తెలంగాణ. ఈ పోరాటంకు నా ప్రాణాన్ని ఇస్తామని ముందుకు వొచ్చిన నేత సీఎం కేసీఆర్‌ ‌మాత్రమేనన్నారు. 2009లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్షకు దిగారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక మాట్లాడిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌ ‌సాక్షిగా తెలంగాణ ఏర్పడితే అవమానపరిచే విధంగా ప్రధాని మాట్లాడుతున్నారు. గడచిన 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్‌ ‌ముందుకు తీసువచ్చారు. దేశంలో తెలంగాణ నెంబర్‌ 1 ‌గా నిలుస్తుందని బీజేపీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి అంటే గుజరాత్‌ ‌పరిస్థితి పోయి తెలంగాణ వొచ్చిందన్న అక్కసుతో ప్రధాని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందవద్దు, తెలంగాణ రైతులు, బిడ్డలు ముందుకు సాగవద్దని ప్రధాని కోరుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు భారత దేశ ప్రజలు కారా? అని నామా ప్రశ్నించారు. ప్రతిసారి తెలంగాణ ప్రస్తావన వొచ్చినప్పుడు ఈర్ష్య కనబడుతుంది. ప్రధాని మోదీ అసందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను ప్రధాని అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటు సాక్షిగా ఏర్పాటైన రాష్ట్రంపై మోదీ వ్యాఖ్యలు సరికావన్నారు.

Leave a Reply