Take a fresh look at your lifestyle.

ఆధునిక వ్యవసాయ పద్ధతులే ఆదాయానికి మార్గం

వ్యవసాయమే దేశాభివృద్ధికి పట్టుకొమ్మ రైతే రాజు రైతు సంక్షేమమే అన్ని వర్గాల ద్యేయం చట్టాలు సంస్కరణలు, సవరణలు ఎన్ని చేసిన అవి అన్ని రైతే సంకేమనికే అని చెప్పుకొనే వర్గాలు కోకొల్లలు రైతు పక్ష పాతిగా వెలుగొందాలి అని కలవరపడే ప్రబుత్వాలు రైతు సంక్క్షెమ సంఘాలకు పెద్దపీట వేసాయి అయితే ఈ చట్టాలు సంస్కరణలు వ్యవసాయంలో ప్రత్యక్ష పెట్టుబడి దారుల దాష్టికం వెరిసి రైతు ఉద్యమాల పోరాటాలకు చిగురుటాకులా వణికిన డిల్లీకి 72 వఘనతంత్రము రణతంత్రగ మారిపోయింది అని చెప్పొచ్చు ,అయితే ఈ సాగు వ్యవస్థ ఆధునిక సంస్కరణలను ఎందుకు ఆపాదించుకోలేక పోయింది నేటికీ రైతుల ఆత్మా అత్యలు సాధరణ మరణాలుగా పరిగణలోకి వెళ్లిపోయాయి ఆనడంలో ఆచర్యం లేదు.

అయితే ఈ ఆధునిక చట్టాలతో మమేకమై సాధారణ రైతు ఆర్ధిక స్వావలంబన సాగాలి అంటే వ్యవసాయ పద్ధతి దిశా మారాల్సిందే అని సర్వే లు చెపుతున్నాయి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌ ‌ద్రవ్యపరమైన చర్యలు స్థిరంగా నిలవాలి అంటే సంస్కరణల సాగు సక్రమంగా జరిగి తీరాలి, వ్యవసాయ రంగాన్ని ఆధునిక ,కృత్రిమ ,సైటిఫికే ,ఆర్గానిక్‌ ‌లాంటి ఆధునిక పద్ధతుల్లో ఉన్న ఆదాయమార్గాలను సవివిరంగా వివరించే సదస్సులు విరివిగా జరగాలి ,ఈ మూస పద్ధతి సాగు లో పెట్టుబడి పెట్టి లెక్క చేతికి రాక చితికి చతిలంయ్యే రైతాంగానికి ఈ వ్యవసాయ రంగాన్ని వ్యాపార కోణం లోకి ఎలా చొప్పించాలి అనే మెళుకువలు నేర్పించాలి

దేశ పురోగతిలో నిలకడమైన అభివృద్ధి జరగాలి అంటే వ్యవసాయాన్ని గ్రామీణ ఉపాధి రంగంగా కాకుండా ఆద్యమార్గాలు పెంచే వ్యాపారసంస్థ మరల్చి రైతు ను పెట్టుబడి దారి వ్యవస్థనుండి తట్టుకొనే శక్తి నివ్వాలి కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యవసాయం దాని ఆధారిత రంగాలు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయి ,తెలంగాణ రాష్ట్రము లో ముక్య్నగా ఉత్తర తెలంగాణాలో తిరిగి రెండు పంటలు పండే పూర్వ స్థితికీ చేర్చడం లో ప్రభుత్వ పాత్రని రైతాంగం అభినందించే లేక ఉండలేదు దాదాపు అన్ని భూముల్లో సాగు సవ్వడి కొనసాగుతుంది ,అయితే కష్టించి పండించిన పంటను అమ్మే పద్ధతుల్లో క్రమంగా ఏర్పడే అక్రమాలను పసిగట్టాలి రైతు సంక్షేమం కోసమేఏరపడిన రైతు సంఘాలు సమావేశాలకే పరిమితం కాకుండా సమస్యలసాధనకై నిరంతరం కృషి చెయ్యాలి

ఈ చర్యలతో నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చెయ్యొచ్చు అని సర్వే లు చెపుతున్నమాట ఆధునిక పరిజ్ఞానంతో టెక్నాలజీ ని అనుసఅందనంతో సాగు చేస్తే ఫలితాలు ఆదికమవుతాయి గ్రామీణ వ్యవసాయ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన రైతులచే ప్రతిరోజూ సాయంకాలం అవగాహనా కార్యక్రమాలు విరివిగా అజరగాలి వ్యవసాయ అనుబంధ రంగాలైన అడవి మత్స్య మరియు గిరిజన జాతుల్లో గిరి ఆధారిత ఆదాయమార్గాలను జోడించాలి

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయంగా వర్ణింపవచ్చు. సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, జీవుల వివిధ దశలను మరియు నేలలో గల సూక్ష్మ జీవుల పనితనాన్ని వృద్ధి పరుస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని విస్మరిస్తూ, సేద్య, జీవ సంబంధ మరియు యాంత్రిక పద్ధతులతో వ్యవసాయం చేయుటకు అవకాశం కల్పిస్తుంది.

సేంద్రియ వ్యవసాయం అనగా సహజ సిద్ద కర్బనం కలిగియున్న మొక్కల, జంతు, నీటి వ్యర్ధాలు మరియు ఇతర జీవపదార్థాలతో పాటు జీవన ఎరువులను ఉపయోగించుకొని నేలలోని పోషకాలను పంటలకు సమగ్రంగా అందే విధంగా సుస్థిర వ్యవసాయ దిగుబడులను సాధిస్తూ నేల, నీరు, వాతావరణం, కాలుష్యం కాకుండా కాపాడుతూ నేల సజీవంగా ఉండే విధంగా పంటలను పండించడం. ప్రపంచ వ్యాప్తంగా 43.7 మిలియన్‌ ‌హెక్టార్లలో సేంద్రియ సాగు చేస్తున్నారు. దీని విలువ 80 బిలియన్‌ అమెరికా డాలర్లు. అదేవిధంగా భారతదేశంలో కూడా 4.72 మిలియన్‌ ‌హెక్టార్లలో సేంద్రియ సాగు చేస్తున్నారు. దీని విలువ 31.2 బిలియన్‌ అమెరికన్‌ ‌డాలర్లుగా ఉంటుంది.

సేంద్రియ వ్యవసాయములో అతి ముఖ్యమైన విధానం వివిధ రకాల జీవులు సహకార జీవనం కలిగి ఉండే విధంగా క్షేత్రాన్ని నియంత్రించాలి. దీనికోసం వివిధ పంటల సాగు, వివిధ రకాల మొక్కల పెంపకం, వాతావరణానికి అనుగుణంగా పెంచాలి. ఈ విధమైన వృక్షాలు మరియు చెట్లు భూమి లోపలి పొరల నుండి మరియు వాతావరణం నుండి పోషకాలను సంగ్రహించడమే కాకుండా పక్షులకు, పరాన్న భుక్కులకు, మిత్రపురుగులకు ఆహారాన్ని, నీడను ఇస్తాయి. వీటి నీడ వలన కొంత పంట ఉత్పత్తి తగ్గినప్పటికి సహజ ప్రక్రియ ద్వారా కీటకాలను అదుపుచేయడం ద్వారా పంట దిగుబడి నష్టాన్ని పూరిస్తుంది

పంటల యాజమాన్య పద్దతుల పైన తెలంగాణ ప్రభుత్వం ఒక ఆప్‌ ‌ని తీసుకొచ్చింది ఈ యాప్‌ ‌ను వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం వారు నేషనల్‌ ఇన్ఫోర్మాటిక్‌ ‌సెంటర్‌ ‌వారి సహకారంతో రూపొందించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రైతులు వరి , మొక్కజొన్న , కంది , సోయాబీన్‌ ‌మరియు ప్రత్తి పంటలను సాగుచేస్తారు. ఇందులో పైన పేర్కొన్న పంటలకు సంబంధించిన యాజమాన్య పద్ధతులు , వాటిలోని విత్తన రకాలు , విత్తన శుద్ధి , విత్తే సమయము , విత్తే దూరము ,ఎరువుల యాజమాన్యం , కలుపు నివారణ చర్యలు , నీటి యజమాన్యము, చీడ పీడల లక్షణాలు , చీడపీడల నివారణ మరియు పురుగు మందుల వాడకం గురించి సమగ్రంగా పొందుపరచడము జరిగింది

ఢిల్లీ కేండ్రన్గా ఇంత రచ్చ జరుగుతున్నా నూతన వ్యవస్య చట్టాలలతో రైతులకు స్వేత్చా లభించింది అని కేంద్రం తనను తానూ సమర్ధించుకుంది కానీ ఈనాటికి సాధారణ రైతు చట్టలపైనా అవగాహనే లేకుండా తాను నమ్మిన పద్ధతుల్లో వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాడు 8585: పైగా ఉన్న చిన్న మధ్యస్థాయి వారి ప్రయోజనాలకే చట్టాలు ఉన్నాయని వారి అభివృద్ధి కి ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యం తోనే ఈ చట్టాలు ఉన్నాయని పార్లమెంట్‌ ‌సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం తో పునురుద్ఘాటించారు అయితే పల్లె సీమలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అన్న బాపూజీ మాటల్లో గ్రామీణ వ్యవసాయ పద్ధతులకు ఆధునిక వ్యవసాయ చట్టాలకు పొంతనే లేదు అని అనుభవజ్ఞుల వాదన

– డా।। సామల్ల కృష్ణ, ఫ్రీలాన్స్ ‌జర్నలిస్ట్

Leave a Reply