గుర్రపు స్వారీ చేస్తూ గాయపడి మృతి
మెల్‌బోర్న్,మే6 : మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్, ప్రముఖ మోడల్ సియెన్నా వీర్ మరణించారు. సియెన్నా వీర్ గుర్రపు స్వారీ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. గనెల 2న ఆస్టేల్రియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్‌లో స్వారీ చేస్తుండగా.. ఆమె అకస్మాత్తుగా గుర్రం ది నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమెకు గాయాలయ్యారు. మే 2వరకు సియెన్నా లైఫ్ సపోర్ట్ పై ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె చనిపోయిందన్న విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు న్యూయార్క్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు.
ఆమె మోడలింగ్ ఏజెన్సీ స్కూప్ మేనేజ్‌మెంట్ సైతం సియెన్నా మరణాన్ని ధృవీకరించింది. 2022లో జరిగిన ఆస్టేల్రియన్ మిస్ యూనివర్స్ పోటీలో 27 మంది ఫైనలిస్టులలో సియన్నా వీర్ ఒకరు. సిడ్నీ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యం, మనస్తత్వశాస్త్రంలో ఆమె డబుల్ డిగ్రీ చేసింది. ఇక ఆమె మరణ వార్తను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన కుటుంబసభ్యులు.. ‘ఎప్పటికీ మన హృదయాల్లో‘ అనే క్యాప్షన్ తో పలు ఫొటోలను పోస్టు చేశారు. గత నెలలో గుర్రపు స్వారీ చేస్తూ ఘోర ప్రమాదానికి గురయ్యారు.