Take a fresh look at your lifestyle.

ఆర్తనాదం..!!

చూడు అడివి చుట్టూరా
‘నిప్పులు’ కక్కే  పహారా
మహమ్మారి  లోపలా
దానికిలేదు కాపలా

కోవిడ్‌ ‌బిగి కౌగిట్లో  చిక్కిరి
అడవి బిడ్డల ఉక్కిరి బిక్కిరి
ఆగుతున్న వాళ్ళ  ఊపిరి

కాలిబాట కూడా లేనీ గూడాలు
చికిత్స కోసం కదలలేని ఆగడాలు
ఇక ముందుకు రావాలి  సర్కార్‌!!
ఆరోగ్యశిబిరాలు పెట్టాలే బరాబర్‌!!!
‌కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర 

Leave a Reply