బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్,భీమిని,నెన్నెల,కాసిపేట మండలాల మామిడి పత్తి రైతుల పరిస్దితి శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి చివరి దశలో చేతికి వచ్చిన పత్తికి నష్టం వాటిల్లింది. నియోజకవర్గంలో లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారు. నవంబర్ వరకు వర్షాలు కురవడంతో ఫిబ్రవరి వచ్చిన పత్తి సాగు పనులు పూర్తి కాలేదు. ఎకరానికి రెండు నుంచి నాలుగు గంటలు వచ్చే సమయంలో వర్షం కురవడంతో పత్తి నాణ్యత దె్బ•తినే ప్రమాదం ఉందని నియోజకవర్గంలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది.
నష్టాల్లో మామిడి రైతు
అకాల వర్షం మామిడి రైతులను సైతం దెబ్బతీసింది. మామిడి పంటలు పూత పిందె లేక బాదపడుతున్న రైతులను శనివారం రాత్రి వదలకుండా కురిసిన వర్షానికి తీవ్ర దెబ్బతీసింది. వారం రోజుల నుండి మబ్బులు వస్తుండడంతో తోటలో పూత రాళ్ళతో వస్తుంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రైతుల పరిస్దితి దయనీయంగా మారింది. ఈ ఏడాది పూత సరిగా రాక రైతులు ఆందోళనలో ఉన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో చుట్టు ప్రక్కల మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇప్పటికే మామిడి తోటలు పిందదశలో ఉండాలి. పూత దశలోనే ఉన్నాయి. ఈ అకాల వర్షంతో వచ్చిన కాస్త మామిడి పూత కూడా రాలిపోతోందని మామిడి రైతులు బాదపడుతున్నారు.