కరోనా వైరస్‌తో సామాన్య ప్రజానికం అర్థికంగా దివాలా తీశారని కరెంటు బిల్లులను ఓకేస్లాబులో తీసి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని మూడు దఫాల అవకాశం కల్పించాలని ఎస్ఈని కోరేందుకు పోతే పోలీసులు అడ్డుకోవడమేంటని పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవార సిఎం కేసిఆర్‌కు వినతిపత్రం పంపిన అనంతరం ట్రాన్స్‌కో ఎస్ఈకి కరెంటు చార్జీలను మూడు విడతలుగా వసూలు చేయాలనే విజ్ఞాపనను అందించేందుకు ట్రాన్స్‌కో కార్యాలయానికి కాంగ్రెస్ శ్రేణులు వెంటరాగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరారు.
ఇంటి నుంచే వెంటవచ్చిన పోలీసులు తీరా పోలీస్ స్టేషన్ ముందే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోవడంతో కొద్దిసేపు పోలీసులకు, కాంగ్రెస్ నాయకుల మద్యన తోపులాట జరిగింది. చివరకు అక్కడే బైటాయించిన జీవన్‌రెడ్డి పోలీసుల చర్యపై మండిపడ్డారు. ట్రాన్స్‌కో ఎస్ఈని కలిసి ప్రజల కష్టాలను చెప్పి మూడు వాయిదాలలో కరెంటు బిల్లు చెల్లించే అవకాశాన్ని ఇవ్వాలని కోరడానికి పోతే ఈ అడ్డుకోవడమేంటని అవేదన వ్యక్తం చేశారు. ఇంతకి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఈకార్యక్రమములో జిల్లా కాంగ్రెస్‌పార్టీ అద్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కాంగ్రెస్ నాయకు బండశంకర్, రఘువీర్‌గౌడ్, నరేష్‌గౌడ్, కమటాల శ్రీనివాస్, కౌన్సిలర్ దుర్గయ్య, నక్క జీవన్‌తోపాటు పలువురు ఉన్నారు.