Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ ‌స్వయంకృతం ..!

ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ఎంఎల్‌సీ జీవన్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు వోటు వెయ్యమని ప్రజలు ప్రత్యక్షంగా చెప్పారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ ‌వ్యతిరేక వోట్లన్నీ ఈటలకు పడ్డాయన్నారు. కౌశిక్‌రెడ్డి వల్లనే కేసీఆర్‌ ఓడిపోయారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ‌నుంచి కౌశిక్‌ ‌రెడ్డి పోటీ చేస్తే 30,40 వేల వోట్లు వొచ్చేవని అన్నారు. కౌశిక్‌ ‌రెడ్డితో ఈటలకు వోట్లు తగ్గి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచే వాడని ఆయన వ్యాఖ్యనించారు. కౌశిక్‌రెడ్డి తమ పార్టీలో చేరితే  60 వేల వోట్లు టీఆరెస్‌కు వొస్తాయని కేసీఆర్‌ అనుకున్నారని, ఇది కేసీఆర్‌ ‌తనకు తానుగా చేసుకున్న తప్పిదమని జీవన్‌ ‌రెడ్డి అన్నారు.

Leave a Reply