Take a fresh look at your lifestyle.

జాప్యం లేకుండా నష్ట పరిహారం అందించాలి కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే పెద్ది

పాకాల రంగాయ్య చెరువు ప్రాజెక్టు క్రింద నష్ట పరిహారం రావాల్సి పెండింగ్‌లో ఉన్న రైతులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ ములుగు జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణమాదిత్యను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి కలిశారు. గురువారం ఎమ్మెల్యే కలెక్టర్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ములుగు ప్రాజెక్టు నిర్మాణం, మరియు పైపులైన్‌ ఏర్పాటు కింద కొంత భూమిని కోల్పోయిన నిర్వాసితులకు దాదాపు అందరికి న్యాయ పరంగా అంచనా మేరకు నష్ట పరిహారం చెల్లించినట్లు తెలిపారు. పలు రకాల రెవెన్యూ సమస్యలతో కొంత మంది రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం పెండింగులో ఉన్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రాగా ములుగు కలెక్టర్‌ను కలిసి ఎలాంటి జాప్యం లేకుండా వారికి పరిహారాన్ని చెల్లించి, తక్షణమే అట్టి రైతులను ఆదుకోని న్యాయం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ములుగు సమీపంలో ఉన్న పాకాల రంగాయ్య చెరువు ప్రాజెక్ట్ ‌వద్ద హరితహారం కార్యక్రమం చేపట్టి ఆ  ప్రాంతాన్ని హరిత వనంగా తీర్చిద్దిద్దాలని కోరారు. తదనంతరం ప్రాజెక్టును సందర్శించి కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం కావాల్సి ఉంటుందని తెలిపారు. దానికి సంబంధించిన నట్‌ ‌బోల్ట్ ‌ఫిట్టింగ్‌తో కూడిన అధునాతన టెక్నాలజీతో తెలంగాణలొనే మొదటి సారిగా నిర్మాణం చేపట్టిన పైలాన్‌ ‌పనులను పరిశీలించారు. మిగిలిపో యిన విద్యుత్‌ ‌సపై ఇంకా బిగించాల్సిన మోటార్లు, పెయింటిగ్‌, ఇతరత్రా సిమెంట్‌ ‌ప్యాచ్‌ ‌వర్కస్ ‌మొదలగు పనులను వేగవంతం చెయ్యాలని అధికా రులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న విషయం దృష్టిలో ఉంచుకొని పనుల వేగవంతం చేసి సిద్ధంగా ఉంచాలని దేవాదుల ఈఈ సాయిబాబా మరియు డీఈ నాసం రాజులను కోరారు.

Leave a Reply

error: Content is protected !!